F3 Movie : ఎఫ్2 సినిమాకు సీక్వెల్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఎఫ్2 లాగే ఇందులోనూ కామెడీని పండించారు. ఎఫ్2లో ఉన్న నటీనటులు అందరూ ఇందులోనూ సందడి చేశారు. ముఖ్యంగా వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్‌తో మరోమారు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ క్రమంలోనే సినిమా నిర్మాతలకు భారీగానే లాభాలను తెచ్చి పెట్టింది. దీంతో అనిల్ రావిపూడి ఎఫ్4ను కూడా తీస్తానని.. అందులో స్టార్ హీరోలను నటింపజేస్తానని తెలిపారు. కాగా వేసవిలో మే 27వ తేదీన ఈ మూవీ రిలీజ్ అయింది. కానీ ఇప్పటి వరకు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఎఫ్3 మూవీ థియేటర్లలో రిలీజ్ అయితే నెల రోజులకు పైగానే అవుతోంది. అయినప్పటికీ ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. అయితే ఎట్టకేలకు ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను సోనీ లివ్ సొంతం చేసుకుంది. దీంతో ఆ యాప్‌లో ఈ మూవీని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే జూలై 22 నుంచి ఈ మూవీని సోనీ లివ్‌లో స్ట్రీమ్ చేయనున్నారు. ఇక ఈ మూవీలో వెంకటేష్ పక్కన తమన్నా నటించగా.. వరుణ్ తేజ్ పక్కన యథావిధిగానే మెహ్రీన్ యాక్ట్ చేసింది.
ఎఫ్3 మూవీని దిల్ రాజు నిర్మించగా.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఇందులో పూజా హెగ్డె ఓ ప్రత్యేక సాంగ్‌లో డ్యాన్స్ చేసింది. లైఫ్ అంటే ఇట్టా ఉండాలా.. అంటూ సాగే ఈ పాట మాస్ ప్రేక్షకులనే కాక క్లాస్ ప్రేక్షకులను కూడా అలరించింది. ఇప్పటికీ ఈ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే ఉంది. అయితే ఎట్టకేలకు ఎఫ్3 మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుండడంతో ప్రేక్షకులు ఈ మూవీని ఎప్పుడు చూద్దామా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…