Sri Reddy On Naresh : సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ల వ్యవహారం మళ్లీ ఒక కొత్త మలుపు తీసుకుంది. మైసూర్‌లో వారు బస చేసిన హోటల్‌కు నరేష్ భార్య రమ్య రఘుపతి చేరుకుని వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే పవిత్రపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రమ్య ఆమెను చెప్పుతో కొట్టేందుకు యత్నించగా.. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. తరువాత ఇరు పక్షాలను వేర్వేరుగా బయటకు పంపించారు. ఈ క్రమంలోనే ఈ వార్త సంచలనం సృష్టిస్తోంది. అయితే తాజాగా నటి శ్రీరెడ్డి ఈ విషయంపై స్పందించింది. ఆమె నరేష్‌తోపాటు పలువురిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
నరేష్ ఒక వేస్ట్ ఫెలో అని శ్రీరెడ్డి పేర్కొంది. అతను తనను మా అసోసియేషన్ నుంచి బ్యాన్ చేశాడని.. తన వల్ల అసోసియేషన్ అపవిత్రంగా మారిందని.. అందువల్ల యాసిడ్‌తో కడగాలని అప్పట్లో అన్నాడని.. అయితే కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుందని.. కాస్త ఆలస్యం అయినా సరే.. కర్మ తప్పక చూపిస్తుందని.. శ్రీరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇక పవిత్ర లోకేష్ అప్పట్లో తనకు సపోర్ట్ చేయలేదని.. తాను కాస్టింగ్ కౌచ్ ఉద్యమంపై పోరాడుతుంటే తనపై లేని పోని ఆరోపణలు చేసిందని.. అయితే ఇప్పుడు సమస్య ఆమెకు వచ్చిందని.. మరి ఇప్పుడు ఆమెకు ఎవరు మద్దతు పలుకుతారు.. అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించింది.
ఇక నరేష్, పవిత్రా లోకేష్‌లపై వ్యాఖ్యలు చేస్తూనే మరోవైపు పవన్ కల్యాణ్‌ను కూడా ఆమె దూషించింది. కల్యాణాల పవన్ అంటూ కామెంట్స్ చేసింది. తనను ఇబ్బందులకు గురిచేసిన వాళ్ల సినిమాలు ఇప్పుడు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయని శ్రీరెడ్డి కామెంట్స్ చేసింది. ఈ క్రమంలోనే ఆమె తన సోషల్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…