F3 Movie : వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా వస్తున్న చిత్రం.. ఎఫ్3. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 27వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఎఫ్2కు సీక్వెల్ గా వస్తున్న ఎఫ్3 మూవీలో వినోదం రెండు రెట్లు పెరిగిందని ఇప్పటికే విడుదలైన ఎఫ్3 ట్రైలర్‌ను చూస్తే అర్థమవుతోంది. ఇక ఈ మూవీకి చెందిన స్టోరీ కూడా సోషల్ మీడియాలో లీకైనట్లు వార్తలు వస్తున్నాయి. సెకండాఫ్ లో 20 నిమిషాల పాటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఎపిసోడ్ ఒకటి ఉంటుందని సమాచారం. దీంతో మూవీకి ఇదే హైలైట్ అవుతుందని అంటున్నారు.
ఇక ఎఫ్3 మూవీకి గాను డిజిటల్ హక్కులను ఇప్పటికే అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. దీంతో అదే ప్లాట్‌ఫామ్‌పై ఈ మూవీ విడుదల కానుంది. అయితే నిర్మాత దిల్ రాజు చెబుతున్న ప్రకారం.. సినిమా విడుదలైన 50 రోజుల తరువాతే ఓటీటీలోకి ఇవ్వాలని అనుకున్నారట. అలా చూస్తే ఎఫ్3 మూవీ జూలైలోనే స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది. అయితే ఇదంతా సినిమా హిట్ అయితేనే జరుగుతుంది. లేదంటే మూవీ 3 వారాల్లోనే ఓటీటీలోకి వస్తుంది. ఇక ఈ విషయంపై మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రానుంది.
కాగా ఎఫ్3 మూవీలో సునీల్, రాజేంద్ర ప్రసాద్, సోనాల్ చౌహాన్‌లు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అలాగే పూజా హెగ్డె ఓ ప్రత్యేక సాంగ్‌లో అలరించింది. ఆ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలోనే సినిమా కూడా హిట్ అవుతుందని మేకర్స్ అనుకుంటున్నారు. కరోనా మూడో వేవ్ తరువాత పక్కా కామెడీ జోనర్‌లో రిలీజ్ అవుతున్న మొదటి మూవీ ఇదే కావడం విశేషం. దీంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రదర్శన చేస్తుందా.. అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఫ్లాగ్‌షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్‌లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…