Wheat Grass Juice : గత రెండు సంవత్సరాల నుంచి కరోనా మహమ్మారి మానవాళి మనుగడకు పెద్ద సవాల్ విసురుతోంది. ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకున్నప్పుడే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీంతో ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా ఉండగలుగుతారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ సహజసిద్ధంగా పండిన ఆకుకూరలు, కూరగాయలను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మనకు ప్రస్తుతం గోధుమగడ్డి జ్యూస్ కూడా ఎక్కువగానే లభిస్తోంది. దీన్ని రోజుకు ఒక కప్పు చొప్పున పరగడుపునే తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమగడ్డిలో ఉండే ఔషధ గుణాలు ఆర్థరైటిస్, జలుబు సమస్యలను తగ్గించడంలో దోహదపడతాయి. ఇక ఈ జ్యూస్ ను రోజూ తాగడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. ఈ జ్యూస్‌ను తాగడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు తొలగిపోతాయి. ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది. అలాగే అజీర్ణం, గ్యాస్ నుంచి విముక్తి లభిస్తుంది.
ప్రతి రోజూ ఉదయం పరగడుపునే గోధుమ గడ్డి జ్యూస్ తాగడం వల్ల ఆకలి అదుపులో ఉండి శరీర బరువు తగ్గుతుంది. శరీరంలోని కొవ్వు కరుగుతుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసి రక్తం ఎక్కువగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. మహిళలు నెలసరి సమయంలో దీన్ని తాగితే నొప్పులు తగ్గిపోతాయి. ఇలా గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగితే అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…