Cardamom Milk : సుగంధ ద్రవ్యాలుగా పరిగణించే యాలకులను కూరలో వేస్తే ఘుమఘుమలాడుతాయి. పోషకాలు, ఫైబర్ కూడా ఈ గింజలలో ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో చూద్దాం. యాలకుల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడి ఆహారం జీర్ణం అయ్యేలా చేసి గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు సరిగ్గా లేకపోతే అనేక రకాల సమస్యలు వస్తాయి. జీర్ణక్రియను వేగవంతం చేయడంలో యాలకులు సహాయపతాయి. అంతేకాక కడుపు లైనింగ్ వాపును తగ్గిస్తాయి.
మనలో చాలా మంది ఒత్తిడి, సరైన జీవనశైలి లేని కారణంగా నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు రాత్రి సమయంలో యాలకుల పాలను తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది. పాలు, యాలకుల్లో కాల్షియం సమృద్ధిగా ఉండడం వలన శరీరంలో కాల్షియం స్థాయిలను పెంచి కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు. యాలకుల్లో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్ సమృద్ధిగా ఉండడం వలన రక్తాన్ని శుద్ధి చేయడానికి మరియు ధమనులలో అడ్డంకులు లేకుండా చేస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి సహాయపడి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. నోటిలో పొక్కులు, నోటిపూతను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే నోటి దుర్వాసన కూడా తగ్గిస్తాయి.
యాలకులలో ఉండే ఔషధాలు లైంగిక ప్రేరణను పెంచడానికి తోడ్పడుతాయి. ఇది వేగంగా స్ఖలనం కాకుండా కాపాడుతుంది. దీంతో పడకగదిలో ఎక్కువసేపు ఆనందంగా గడుపుతారు. యాలకుల్లో విటమిన్ సి సమృద్దిగా ఉండడం వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి సీజనల్ గా వచ్చే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, గొంతు ఇన్ ఫెక్షన్స్ నుంచి కాపాడుతాయి. పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి దానిలో ఒక యాలకను దంచి వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత ఒక స్పూన్ బెల్లం తురుము లేదా తేనె వేసి ఒక నిమిషం మరిగించి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ పాలను రోజు విడిచి రోజు తాగితే సరిపోతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తాగాలి. యాలకులు మరియు పాలను కలిపి తీసుకుంటే పైన చెప్పిన ప్రయోజనాలను పొందవచ్చు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…