Tanikella Bharani : డబ్బులు తీసుకొని ఇంట్లో నుంచి గెంటేశారు.. తనికెళ్ల భరణి వ్యాఖ్యలు వైర‌ల్‌..

Tanikella Bharani : నటుడిగా, రచయితగా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వాళ్లలో తనికెళ్ళ భరణి కూడా ఒకరని చెప్పవచ్చు. దాదాపు మూడు వందలకు పైగా చిత్రాలలో నటించి ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. విలన్ గా, స్నేహితుడిగా, తండ్రిగా ఎన్నో పాత్రలలో పరకాయ ప్రవేశం చేసి పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే నటుడు తనికెళ్ల భరణి. తనికెళ్ల భరణి మిథునం అనే చిత్రానికి దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రంలో అలనాటి హీరోయిన్ లక్ష్మి, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం నటించారు. కేవలం రెండు క్యారెక్టర్ల తోనే ఈ చిత్రాన్ని రూపొందించడం ద్వారా దర్శకుడిగా తనికెళ్ల భరణి ప్రతిభ బయటప‌డింది.

తనికెళ్ల భరణి తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా తనికెళ్ళ భరణి తనకు ఎదురైన ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి వెల్లడించారు. మద్రాస్ లో ఉన్న సమయంలో గుంటూరు శాస్త్రి అనే వ్యక్తి ద్వారా నాకు ఇ.వి.వి సత్యనారాయణ పరిచయమయ్యారు. ఆయన చెవిలో పువ్వు అనే ఒక చిత్రానికి స్క్రిప్ట్ రాసుకుని వచ్చారు. ఒక పెద్ద పుస్తకం నాకు ఇచ్చి దానిపై స్క్రిప్ట్ ని తయారు చేయమన్నారు. నేను దాన్ని మార్చిరాయడం ఇ.వి.వి సత్యనారాయణకి అది నచ్చలేదు. ఎన్నో ఏళ్లుగా నేను ఆ స్క్రిప్టుని రాసుకున్నాను. మీరు కావాలంటే కథలో కొత్తగా ఏమన్నా జతచేయండి గానీ, కథను మార్చిరాయవద్దు అని ఇ.వి.వి సత్యనారాయణ అన్నారని తనికెళ్ల భరణి చెప్పుకొచ్చారు.

Tanikella Bharani

నాకు దేవరకొండ నరసింహ కుమార్ అనే స్నేహితుడు ఉండేవారు. తను నాలో ఉన్న రచయితను ఎంతగానో ప్రోత్సహించేవారు. అతని హఠాన్మ‌రణం నా జీవితంలో అత్యంత బాధాకరమైన విషయమని తనికెళ్ల భరణి తెలియజేశారు. అదేవిధంగా రాళ్ళపల్లి గారి ఇంట్లో నేను, నా భార్యతో కలిసి కొత్తగా దిగాము. ఆయన ఇంట్లో నాకోసం ఒక సెపరేట్ గది కూడా ఉండేది. భీమరాజు అనే ఫైట్ మాస్టర్ గ్రౌండ్ ఫ్లోర్ ని అమ్ముతున్నారని తెలిసి నువ్వు తీసుకుంటే బాగుంటుంది అని ఆయన నాకు సూచించారు.

40 సంవత్సరాల క్రితం మూడు లక్షల రూపాయలకు ఇంటిని కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. నిదానంగా డబ్బులు ఇవ్వచ్చు అని చెప్పడంతో 18 నెలల్లో రెండు లక్షల రూపాయలు ఆ ఇంటి ఓనర్ కి ఇచ్చాను. ఆ తర్వాత డబ్బుల‌ విషయంలో ఒత్తిడి చేసి నన్ను ఇంటి నుంచి వెళ్లగొట్టారని తనికెళ్ల భరణి ఆయన ఎదుర్కొన్న సంఘటన గురించి వెల్లడించారు. ఈ గొడవ తరువాత న‌టుడు టార్జాన్ ను రిక్వెస్ట్ చేసి ఆ ఇంటి ఓనర్ ని బెదిరించి మొదట 50 వేలు తర్వాత పాతిక వేల రూపాయల చొప్పున వసూలు చేసుకోగలిగాను అని ఇంటర్వ్యూ సందర్భంగా తనికెళ్ల భరణి తాను ఎదుర్కొన్న సంఘటనలను తెలియజేశారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

హై బీపీ ఉన్నవారు రోజుకు ఎంత ఉప్పు తినాలి? గుండెను కాపాడుకోవాలంటే ఈ రూల్స్ తప్పనిసరి!

హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…

Friday, 30 January 2026, 6:47 PM

బ్యాంక్ ఆఫ్ బరోడాలో 418 ఐటీ ఉద్యోగాలు: ఎలా అప్లై చేయాలంటే?

దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…

Friday, 30 January 2026, 5:17 PM

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ ఓటీటీ అప్‌డేట్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…

Friday, 30 January 2026, 4:07 PM

ధురంధర్ ఓటీటీ అప్‌డేట్: బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన బ్లాక్‌బస్టర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్‌లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…

Friday, 30 January 2026, 10:50 AM

తిరుమల లడ్డూ వివాదం: వైసీపీ గేమ్ ప్లాన్ ఫలించిందా? ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ!

గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…

Thursday, 29 January 2026, 10:15 PM

జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత హక్కులకు రక్షణ: ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు!

సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…

Thursday, 29 January 2026, 8:27 PM

రైలులో టికెట్ లేదా? భయపడకండి.. ఈ రూల్స్ తెలిస్తే చాలు!

రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్‌లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…

Thursday, 29 January 2026, 6:12 PM

ఎస్‌బీఐలో 2050 భారీ ఉద్యోగాలు: నేటి నుంచే దరఖాస్తులు.. అర్హతలివే!

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…

Thursday, 29 January 2026, 2:43 PM