Sita Ramam : టాలీవుడ్ కి ఆగస్టు నెల బాగా కలిసొచ్చిందని చెప్పొచ్చు. బింబిసార, సీతారామం, కార్తికేయ 2 సినిమాలు సూపర్ సక్సెస్ ని సొంతం చేసుకున్నాయి. ఇందులో సీతారామం మూవీ విషయానికి వస్తే ఇందులో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించారు. రష్మిక మందన్నా, సుమంత్ ముఖ్య పాత్రలు పోషించారు. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మోడర్న్ కల్ట్ క్లాసిక్ గా నిలవడంతో తెలుగు ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు దుల్కర్.
అయితే ఈ చిత్ర దర్శకుడు హను రాఘవపూడికి ఈ చిత్రానికి ముందు అన్ని ఫ్లాపులే ఉన్నాయి. దీనితో హను రాఘవపూడితో సినిమాలు చెయ్యడానికి మన క్రేజీ హీరోలెవరూ ఆసక్తి చూపించలేదు. దీంతో సీతారామం మూవీ స్టోరీ దుల్కర్ కంటే ముందు ఇద్దరు, ముగ్గురు స్టార్ హీరోల దగ్గరకు వెళ్లిందంటూ ఇండస్ట్రీలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. మొదట ఈ స్క్రిప్ట్‌ను రౌడీ బాయ్ హీరో విజయ్ దేవరకొండకు వినిపిస్తే అతడికి పెద్దగా నచ్చలేదని హను రాఘవపూడి ఒకానొక సందర్భంలో వెల్లడించాడు. అయితే రౌడీ హీరో కాకుండా మరో ఇద్దరు హీరోలు కూడా సీతారామం చిత్రాన్ని రిజెక్ట్ చేశారట. వాళ్లు మరెవరో కాదు.. న్యాచురల్ స్టార్ నాని, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని. ఇద్దరూ ప్రేమకథా చిత్రాలు తీయడంలో దిట్ట. కానీ వీళ్ళు ఎందుకో సీతారామం సినిమా విషయానికి వచ్చేసరికి డేట్స్ సర్దుబాటు కాలేకనో, లేకపోతే కెరీర్ మంచి ఊపు లో ఉన్న సమయంలో ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా చేసి రిస్క్ చెయ్యడం ఎందుకనో తెలీదు.. ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదు.
ఇక ఈ సినిమాలో సీత పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కోసం ప్రయత్నం చేశాడు హను. కానీ ఆమె కూడా ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదట. ఆ తర్వాత దుల్కర్ సల్మాన్ కి ఈ కథ చెప్పగానే వెంటనే నచ్చి ఓకే చేసేశాడు. అలా తెరకెక్కిన సీతారామం సినిమా నేడు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీంతో ఇప్పటి వరకు డబ్బింగ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న దుల్కర్ డైరెక్ట్ తెలుగు చిత్రంతో మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు టాలీవుడ్ లో దుల్కర్ కి మంచి మార్కెట్ ఏర్పడింది. ఈ సినిమానే మన హీరోలు చేసుంటే వారి కెరీర్ నెక్స్ట్ లెవెల్ లో ఉండేది. వారి బ్యాడ్ లక్ ఇప్పుడు బాధపడి మాత్రం ఏం లాభం.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…