మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరు మాత్రం కాదనుకుంటారు. కానీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాలో నటించమని స్వయంగా త్రివిక్రమే సంప్రదించినా ఒకప్పటి నటి యాక్సెప్ట్ చేయకపోవడం విశేషం. ఇంతకీ త్రివిక్రమ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేయని నటి ఎవరనుకున్నారు.. లయ.. ఆవిడ ఒప్పుకోకపోవడానికి రీజన్ ఏంటంటే..
అజ్ణాతవాసి ఫ్లాప్ తో త్రివిక్రమ్, జూనియర్ ఎన్‌టీఆర్ ల కాంబినేషన్ మూవీని బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి అన్న పట్టుదలతో ఉన్నారు త్రివిక్రమ్. అందుకే ఈ మూవీ స్క్రిప్ట్ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా ఈ మూవీకి సంబంధించిన నటీనటుల ఎంపిక విషయంలోనూ ఆచితూచి అడుగులేశాడు. అందులో భాగంగానే ఒకప్పటి పరిచయంతో నటి లయను సంప్రదించారట. వీరిద్దరికీ ఎప్పుడు పరిచయం అంటే లయ మొదటి సినిమా స్వయంవరంకి త్రివిక్రమే రచయిత. లయని ఎన్టీఆర్ కి అత్తగా నటించాలని కోరారట త్రివిక్రమ్.
డైరెక్టర్ గారు.. నా వయస్సెంతో తెలుసా..? ఇలాంటి క్యారెక్టర్లు ఇస్తే ఎలా చేయగలను.. నాకు సినిమాల్లో బాగా గ్యాప్ వచ్చింది. ఒకవేళ సినిమాల్లో నటించినా మంచి క్యారెక్టర్ చేయాలి కానీ ఈ అత్త క్యారెక్టర్ ఏంటని ప్రశ్నించిందట లయ. దీంతో త్రివిక్రమ్ బిక్క ముఖం వేశారట. ఇప్పటికే నదియా, ఖుష్భూ లాంటి హీరోయిన్లతో సినిమాలు చేసినట్లు త్రివిక్రమ్ లయ దృష్టికి తీసుకెళ్ళారట. అదంతా నాకు తెలుసు.. కానీ నేను మీరు చెప్పే క్యారెక్టర్లో అస్సలు నటించలేను. దయచేసి క్షమించడంటూ సున్నితంగా త్రివిక్రమ్ రిక్వెస్ట్‌ను తోసిపుచ్చిందట లయ. అందుకనే ఆమె అరవింద సమేత మూవీలో నటించలేదు.
ఫ్లాగ్షిప్ స్థాయి ఫీచర్లు, బలమైన కెమెరా వ్యవస్థ, దీర్ఘకాల సాఫ్ట్వేర్ అప్డేట్ల హామీతో వివో X200T ప్రీమియం సెగ్మెంట్లో గట్టి…
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…