అన్నగారు నందమూరి తారక రామారావు సినీ వారసుడిగా తెలుగు తెరకు పరిచయమైన హీరోల్లో కళ్యాణ్ రామ్ కూడా ఒకరు. 1989 లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన బాల గోపాలుడు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు కళ్యాణ్ రామ్. మరలా తిరిగి 2003లో వచ్చిన తొలి చూపులోనే అనే చిత్రంతో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి చిత్రం ఆశించిన మేరకు సక్సెస్ ని సాధించకపోయినా కళ్యాణ్ రామ్ కి మాత్రం నటనపరంగా మంచి గుర్తింపు వచ్చింది.
2005లో అతనొక్కడే చిత్రంతో మొదటి సక్సెస్ ను అందుకున్నాడు కళ్యాణ్ రామ్. ఆ తర్వాత తన సొంత సంస్థలోనే తనకు నచ్చిన కథలు ఎంచుకుంటూ సినిమాలతో హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక 2006లో పెద్దలు కుదిర్చిన సంబంధంతో స్వాతిని వివాహం చేసుకున్నారు కళ్యాణ్ రామ్. పెళ్లిచూపుల సమయంలోనే స్వాతిని చూసి బాగా నచ్చడంతో ఆమెను తప్ప ఎవరినీ పెళ్లి చేసుకోను అని కుటుంబ సభ్యులతో కచ్చితంగా చెప్పేశారట కళ్యాణ్ రామ్. ఇక కళ్యాణ్ రామ్ అభిప్రాయంతో ఏకీభవించి స్వాతితో వివాహం చేశారు కుటుంబ సభ్యులు.
స్వాతి ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేని మంచి కుటుంబం నుంచి వచ్చిన యువతి. పెళ్లికి ముందు ఈవిడ డాక్టర్ గా పని చేసేవారు. పెళ్లి అయిన తర్వాత కుటుంబ బాధ్యతల కోసం తన వైద్య వృత్తిని వదులుకున్నారు స్వాతి. కళ్యాణ్ రామ్, స్వాతి దంపతులకు తారక అద్వైత, శౌర్య రామ అనే ఇద్దరు సంతానం. పిల్లలు పెరిగి పెద్ద అవడంతో కళ్యాణ్ రామ్ సహకారంతో సొంత వీఎఫ్ఎక్స్ సంస్థను స్థాపించారు స్వాతి.
మొదటి నుంచి కళ్యాణ్ రామ్ ప్రయోగాత్మక చిత్రాలతో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ ఆగస్టు 5న బింబిసార చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కళ్యాణ్ రామ్. ఈ చిత్రానికి వశిష్ట దర్శకత్వం వహించారు. కథ పరంగా ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. బింబసార బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబడుతోంది. ఇండస్ట్రీ సంక్షోభంలో ఉన్న సమయంలో బింబిసార చిత్రం సక్సెస్ తో ఊపిరిపోసింది.. అని చెప్పవచ్చు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…