Taraka Ratna : తార‌క‌ర‌త్న మాత్ర‌మే సాధించిన ఓ అరుదైన ఫీట్ ఏంటో తెలుసా..?

January 29, 2023 9:46 PM

Taraka Ratna : కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో ఆసుప‌త్రిలో చేరిన తార‌క‌ర‌త్న‌కి సంబంధించి అనేక వార్త‌లు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. నందమూరి వంశం నుండి 11 ఏళ్ళ కిందట‌ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు తారక రత్న. అప్పటి నుండి ఇండస్ట్రీలో కొనసాగుతున్న తారకరత్న ఇటీవ‌ల‌ టీడీపీలో యాక్టివ్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం నారా లోకేష్ తో భేటీ అయ్యి.. నారా కుటుంబానికి జై కొట్టేశాడు. బాబాయ్ బాలయ్య బాబుతో కార్యకర్తలని ఉత్సాహపరుస్తూ సాగుతున్న పాదయాత్రలో అనుకోకుండా కుప్పకూలిపోయాడు తారకరత్న. ప్ర‌స్తుతం ఆయ‌న‌ క్రిటికల్ కండిషన్ లోనే ఉన్నారు.

తారకరత్న త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో నందమూరి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కోరుకుంటూ.. ఆయన రికార్డులని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నందమూరి కుటుంబంలో తారకరత్న ఒక ఫెయిల్యూర్ హీరో అయినా.. ఆయన పేరుపై ఒక వరల్డ్ రికార్డు ఉంది. ఇతర హీరోలెవరూ కూడా టచ్ చేయలేని రికార్డ్‌ని తార‌క‌ర‌త్న అందుకున్నాడు. ఒకటో నంబర్ కుర్రాడు మూవీ ఓపెనింగ్ రోజే ఏకంగా 9 సినిమాలని ప్రకటించాడు తారకరత్న. ఇదొక వరల్డ్ రికార్డు. ఇండస్ట్రీకి ఎవరైనా ఒక సినిమాతో ఎంట్రీ ఇస్తారు.. లేదంటే రెండు సినిమాలతో వస్తారు. కానీ ఒకేసారి 9 సినిమాలతో ఎంట్రీ ఇచ్చి సంచలనం సృష్టించాడు ఈ నంద‌మూరి హీరో.

do you know this feat about Taraka Ratna
Taraka Ratna

తార‌క‌ర‌త్న ప్ర‌క‌టించిన 9 సినిమాల్లో ఎక్కువ శాతం రిలీజ్ కాలేదు. ఒకటో నంబర్ కుర్రాడు తరువాత.. యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. మిగిలినవన్నీ ఆగిపోయాయి. వీటిలో ఒక్కటి కూడా హిట్ కాకపోవటంతో.. కొద్ది రోజులు గ్యాప్ తీసుకుని అమరావతి సినిమాతో విలన్ అయ్యాడు. అయితే ఆ సినిమా కూడా నిరాశ మిగల్చటంతో.. ప్రస్తుతం రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. చివ‌రిగా ఓ వెబ్ సిరీస్‌లో క‌నిపించి మెప్పించాడు. మంచి టాలెంట్ ఉన్న తార‌క‌ర‌త్న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధిస్తున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment