Chiranjeevi : స్వయంకృషితో ఉన్నత స్థానంలో నిలిచిన చిరంజీవి ఎంతో మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ప్రాణం ఖరీదు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి మెగాస్టార్‌గా ఎదిగి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు చిరంజీవి. పునాది రాళ్లుతో నటుడిగా పరిచయం అయినా.. మొదట రిలీజ్ అయ్యింది మాత్రం ప్రాణం ఖరీదు సినిమానే. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా స్వశక్తితో ఎదిగిన చిరంజీవి జీవితం ఎందరికో ఆదర్శం. ఆయన్ని స్పూర్తిగా తీసుకుని నటులైన వారు చాలామందే ఉన్నారు. స్టైల్, మేనరిజమ్, మాస్ ఆడియెన్స్‌ను మెప్పించడం, జానర్ ఏదైనా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తన నటనతో నిండుదనం తీసుకురావడం ఒక్క చిరంజీవికే సాధ్యం.
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు తర్వాత స్వయంకృషితో స్టార్ హీరోగా ఎదిగిన నటుడు చిరంజీవి. అప్పటికే ఎంతో మంది హీరోలున్నా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకొని మెగాస్టార్‌గా ఎదిగారు. ఇక చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదును ప్రదానం ఎవరు చేశారనే విషయం చాలా మందికి తెలియదు. టాలీవుడ్‌లో చిరంజీవిని మెగాస్టార్‌ను చేసిన నిర్మాత కె.ఎస్.రామారావు. ఈయన తన క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌లో చిరంజీవితో పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు.
చిరంజీవి, నిర్మాత కె.ఎస్.రామారావు కలయికలో వచ్చిన తొలి చిత్రం అభిలాష. యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అభిలాష సినిమా టాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ కాంబినేషన్‌లో వచ్చిన ఛాలెంజ్ చిత్రం కూడా మంచి విజయం సాధించింది. రాక్షసుడు, మరణ మృదంగం సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి. మరణ మృదంగం చిత్రంతోనే అప్పటి వరకు సుప్రీం హీరో బిరుదుతో వస్తున్న చిరంజీవి ముందు మెగాస్టార్ బిరుదు వచ్చి చేరింది. అలా చిరంజీవి ఫ్యామిలీ.. మెగా ఫ్యామిలీగా మారడం వెనుక ఉన్న అసలు వ్యక్తి కేఎస్ రామారావు అనే చెప్పాలి.
దర్శకుడు నితేశ్ తివారి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం రామాయణ టీజర్ విడుదలైంది. ఈ టీజర్‌లో రాముడిగా రణబీర్ కపూర్ తొలి…
హనుమాన్ జయంతి సందర్భంగా తమ ఇంట్లోని పూజ మందిరంలో ఉన్న స్వామి వారి విగ్రహంపై సూర్య కిరణాలు పడడం తన…
బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.…
అమరావతి రాజధానిగా ఉండడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని పేరిట టీడీపీ దోపిడీకి పాల్పడుతోందని, దానికి తాము…
పబ్లిక్‌లో ఉన్నప్పుడు సెలబ్రిటీలతో మాట్లాడేందుకు, వారితో ఫొటోలు దిగేందుకు ఫ్యాన్స్ ఉత్సాహం చూపిస్తుంటారు. దీనికి తోడు కొన్ని సందర్భాల్లో గందరగోళ…
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తన రాబోయే చిత్రం భూత్ బంగ్లాతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన…
శ్రీరాముడు శతాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రజలకు మార్గదర్శకుడిగా ఉన్నాడని నటుడు రణబీర్ కపూర్ అన్నారు. మనం లేని తరువాత కూడా…
ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా జట్లన్నీ తమ తొలి మ్యాచ్‌లను ఆడుతున్నాయి. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శన చేయగా, కొన్ని…