Bhallala Deva : బాహుబ‌లిలో భ‌ళ్లాలదేవుని ముఖంపై ఈ గీత ఎలా వ‌చ్చింది ? మీకు గుర్తుందా ?

May 3, 2022 11:51 AM

Bhallala Deva : తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి. ప్రభాస్, రానా, అనుష్క‌, ర‌మ్య‌కృష్ణ‌, నాజ‌ర్, స‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. 2015 జూలై 10న విడుదలైన బాహుబలి-ది బిగినింగ్ చిత్రం అంద‌రినీ అల‌రించింది. బాహుబలి మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ చిత్రం యావద్భారతాన్నీ అలరించింది. అయితే బాహుబలి-1 లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు ? అన్న ప్రశ్నను వదిలి, సశేషం అన్నారు. ఇక అప్ప‌టి నుండి సెకండ్ పార్ట్‌పై అంద‌రిలోనూ ఆస‌క్తి పెరిగింది.

do you know how Bhallala Deva got this scratch in Bahubali movie
Bhallala Deva

అనేక అంచ‌నాల న‌డుమ బాహుబలి-2 మూవీ 2017 ఏప్రిల్ 28న విడుదలయింది. అనూహ్య విజయం సాధించింది. భారతదేశంలో రూ.1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన‌ తొలి చిత్రంగా చరిత్రలో నిలిచింది. తెలుగులో రూపొంది.. తమిళ, మళయాళ, హిందీ భాషల్లోకి అనువాదమైన బాహుబలి 2 కనీవినీ ఎరుగని విజ‌యాన్ని సాధించి అంద‌రి దృష్టినీ టాలీవుడ్‌పై ప‌డేలా చేసింది. బాహుబలి 2 అప్పుడే రూ.1600 కోట్లుకుపైగా కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్ ప్లాన్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఇది రిలీజ్ అయితే మినిమం రూ.2 వేల కోట్లు కొల్లగొట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

అయితే బాహుబలి చిత్రంలో రానా భ‌ళ్లాల దేవుడిగా క‌నిపించాడు. బాహుబ‌లి చ‌నిపోయిన త‌ర్వాత రానా వృద్ధ‌ భళ్లాలదేవుడిగా క‌నిపించాడు. అయితే సెకండ్ పార్ట్‌లో ఆయ‌న ముఖంపై గీత ఉంటుంది. అది ఎందుకు వ‌చ్చింద‌నే విష‌యం బాహుబ‌లి అభిమానుల‌కి ఎవ‌రికైనా గుర్తుందా ? ఆ గీత‌ని భ‌ళ్లాల‌దేవుడు త‌న‌కు తానే పెట్టుకుంటాడు. కుమార వ‌ర్మ త‌న‌కు హాని క‌లిగించ‌డానికి వ‌చ్చిన‌ట్టు అంద‌రినీ న‌మ్మించ‌డానికి పెట్టుకుంటాడు. ఈ గీత ఎక్క‌డా మిస్ కాకుండా రాజ‌మౌళి చాలా జాగ్ర‌త్తప‌డ్డాడు. అందుకనే మూవీ చాలా చోట్ల రానా ముఖంపై మ‌న‌కు ఆ గీత క‌నిపిస్తుంది. సినిమాలో చిన్న చిన్న అంశాల‌పై కూడా రాజ‌మౌళి ఎంత జాగ్ర‌త్త వ‌హిస్తాడో చెప్పేందుకు ఇది ఒక ఉదాహ‌ర‌ణ మాత్ర‌మే. ఇక రాజ‌మౌళి త్వ‌ర‌లోనే మ‌హేష్ తో సినిమా చేయ‌నున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment