Krishnam Raju : రెబల్‌స్టార్ కృష్ణంరాజు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కృష్ణంరాజు మృతితో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా సంతాపం ప్రకటించారు. కృష్ణంరాజు అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తారు. సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫ్యామిలీకి సంబంధించి ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలు చూద్దాం.. కృష్ణంరాజు 1940 జనవరి 20న పశ్చిమ గోదావరిలోని మోగల్తూరులో జన్మించారు. ఆయన అసలు పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. సినిమాల్లోకి వచ్చాక సింపుల్‌గా కృష్ణంరాజుగా పిలిపించుకున్నారు.
సినిమాల్లోకి రాకముందు ఆయన ఆంధ్రరత్న పత్రికలో ఫోటోగ్రాఫర్‌గా పనిచేశారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదట విలన్‌గా కొన్ని సినిమాలు చేశారు. 1966లో చిలకా గోరింక అనే చిత్రంతో హీరోగా మారారు. దాదాపు 200 సినిమాల్లో నటించినట్టు సమాచారం. రాజకీయంగానూ రాణించారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే ఆయన ఫ్యామిలీ విషయాలు చూస్తే.. కృష్ణంరాజు 2 పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. మొదట ఆయనకు సీతాదేవితో వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేరు. ఓ కూతురుని దత్తత తీసుకున్నారు. 1995లో సీతాదేవి కారు ప్రమాదంలో కన్నుమూసింది. ఏడాది తర్వాత 1996 సెప్టెంబర్ 20న శ్యామలాదేవితో రెండో వివాహం జరిపించారు.
వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. ఇలా మొత్తం కృష్ణంరాజుకి 4 కుమార్తెలు అని చెప్పొచ్చు. పెద్ద కూతురు సాయి ప్రసీద, సాయి ప్రకీర్తి, సాయి ప్రదీప్తి, దత్తత తీసుకున్న మరో కూతురు ప్రశాంతి ఉన్నారు. అందరి పేర్లు ప అక్షరం మీదనే ఉండటం విశేషం. ప్రభాస్, ప్రమోద్ కూడా ప అక్షరంతోనే ఉన్నాయి. కృష్ణంరాజు పెద్ద కుమార్తె (శ్యామలాదేవి మొదటి కూతురు) ప్రస్తుతం నిర్మాతగా రాణిస్తుంది. కృష్ణంరాజు గోపీకృష్ణ మూవీస్ అనే నిర్మాణ సంస్థని స్థాపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ బాధ్యతలను ప్రసీదకి అప్పగించారు. ఇటీవల ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ చిత్రానికి ప్రసీద ఓ నిర్మాతగా వ్యవహరించారు.
కృష్ణంరాజుకు సోదరుడు ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు ఉన్నారు. ఆయన కుమారుడే ప్రభాస్ అని తెలిసిందే. సూర్యనారాయణరాజు అన్న స్థాపించిన గోపీకృష్ణ మూవీస్ బ్యానర్‌పైనే అనేక సినిమాలు నిర్మించారు. భక్తకన్నప్ప, మన వూరి పాండవులు, తాండ్ర పాపారాయుడు, బిల్లా మొదలైన చిత్రాలను నిర్మించారు. సూర్యనారాయణ రాజుకి ఇద్దరు సంతానం. వీరిలో ప్రభాస్ పెద్దవాడు కాగా, సిద్ధార్థ్ రాజ్ కుమార్ చిన్నవాడు. ఆయన కెరటం మూవీలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. నిర్మాత ప్రమోద్ వారి బంధువుల అబ్బాయి. ప్రమోద్ యూవీ క్రియేషన్స్ స్థాపించి నిర్మాతగా రాణిస్తున్నారు. దీని వెనకాల ప్రభాస్ ఉన్నాడనే విషయం తెలిసిందే. ఇక ప్రభాస్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్‌గా, పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…