RRR Movie Malli : రాజమౌళి తెరకెక్కించిన మరో ప్రతిష్టాత్మక చిత్రం.. ఆర్ఆర్ఆర్ ఇటీవలే థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయం సాధించింది. ఈ సినిమా ఇప్పటికే రూ.500 కోట్లకు పైగానే వసూలు చేసి రికార్డుల వేటను కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రశంసలు దక్కుతున్నాయి. భాషలతో సంబంధం లేకుండా అన్ని వర్గాలకు చెందిన ప్రేక్షకులు ఈ మూవీని ఆదరిస్తున్నారు. అయితే ఈ మూవీలో నటించిన మల్లి అనే పాత్ర గురించి మనందరికీ తెలిసిందే. ఈమెది సినిమాలో చాలా కీలకపాత్ర. సినిమా స్టోరీలో 70 శాతం ఈమె చుట్టూనే తిరుగుతుంది. అయితే ఈ మల్లి ఎవరు ? ఆమె అసు పేరు ఏమిటి ? ఎక్కడ ఉంటుంది ? ఏం చేస్తుంది ? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్, ఎన్‌టీఆర్ పాత్రలు మాత్రమే కాకుండా మల్లి పాత్రలో నటించిన బాల నటికి కూడా మంచి పేరే వచ్చింది. అసలు సినిమా మొదలు కావడమే ఈమె పాత్రతో మొదలవుతుంది. బ్రిటిష్ దొరసాని మల్లిని తనతో తీసుకుపోతుంది. దీంతో మల్లిని రక్షించేందుకు భీమ్ ఢిల్లీకి వెళ్తాడు. అక్కడ రామరాజుతో కలిసి ఎట్టకేలకు మల్లిని రక్షిస్తాడు. కానీ కథ అక్కడే మలుపు తిరుగుతుంది. మొత్తంగా చెప్పాలంటే.. భీమ్, రామరాజుల పాత్రలను కలిపేది మల్లి పాత్రనే. ఇక మల్లి పాత్రలో నటించిన ఆమె అసలు పేరు.. ట్వింకిల్ శర్మ. ఈమెది చండీగఢ్.
ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌ను ప్రారంభించినప్పుడు ట్వింకిల్ శర్మ 8వ తరగతి చదుతుండేది. కానీ ఇప్పుడు 10వ తరగతి చదువుతోంది. ఈమె హిందీలో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ అనే ప్రోగ్రామ్‌లో పాల్గొంది. ఎన్నో టీవీ కార్యక్రమాల్లోనూ పాల్గొంది. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన యాడ్స్‌లోనూ నటించింది. సోషల్ మీడియాలో కూడా ట్వింకిల్ శర్మ యాక్టివ్‌గానే ఉంటుంది.
ఈమెను ఫ్లిప్‌కార్ట్ ప్రకటనలో చూసిన రాజమౌళి ఆడిషన్‌కు హైదరాబాద్‌కు రమ్మన్నారు. చండీగఢ్ నుంచి హైదరాబాద్‌కు విమాన టిక్కెట్లను కూడా రాజమౌళి బుక్ చేయించారు. ఇక ట్వింకిల్‌కి తమిళ భాషలో స్క్రిప్ట్‌ను అందించారు. ఆ భాషలోనే ఆడిషన్ చేయించారు. అందుకు ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ను రాజమౌళి నియమించారు. దీంతో తమిళ భాషలోనే ఆడిషన్ చేశారు. ఇక ఆడిషన్‌లో ఆమె నటనకి రాజమౌళి ఆశ్చర్యపోయారు. దీంతో ఆర్ఆర్ఆర్ మూవీలో మల్లి పాత్రకి ఆమెని రాజమౌళి ఫిక్స్ చేశారు. ఇక మల్లి పాత్ర కోసం ఏకంగా 160 మందిని ఆడిషన్ చేశారు. చివరికి మల్లి పాత్ర ట్వింకిల్‌ని వరించింది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో ఆమె నటనకి కూడా మంచి మార్కులే పడ్డాయి. మల్లి యాక్టింగ్ చాలా బాగుందని అందరూ మెచ్చుకుంటున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…