DJ Tillu : డీజే టిల్లు 2 హీరోయిన్ గా శ్రీలీల‌ అవుట్.. ఫైనల్ అయిన అనుపమ‌ పరమేశ్వరన్..!

DJ Tillu : యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సినిమా డీజే టిల్లు. అట్లుంటది మనతోని అనేది సినిమా ట్యాగ్ లైన్. నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేశాడు. ఈ ఏడాది బాక్సాఫీసు వద్ద పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా కలెక్షన్స్ లేక థియేటర్లు వెలవెలబోతే.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన డీజే టిల్లు బ్లాక్‌ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా తరువాత సిద్ధు జొన్నలగడ్డ పేరు డీజే టిల్లుగా మారిపోయింది. అయితే డీజే టిల్లు సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు అందరూ డీజే టిల్లు పార్ట్-2 కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే డీజే టిల్లులో హీరోయిన్ గా నటించిన నేహాశెట్టి ఈ సినిమాలో నటించదంటూ ముందుగానే చెప్పేశారు.

ఈమూవీలో హీరోయిన్ గా తొలుత శ్రీలీల‌ను అనుకున్నా.. అనుపమ‌ పరమేశ్వరన్ ను ఫైనల్ చేశారు. ఇంతకీ శ్రీలీల‌ తప్పుకోవడానికి, అనుపమ‌ ఫైనల్ కావడానికి కారణమేంటో తెలిసింది. తాజాగా దీనిపై నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. శ్రీలీల‌ చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే మాస్ మహా రాజా రవితేజ సరసన ధమాకాలో, అనగనగా ఒక రాజు మూవీల‌లో నటిస్తోంది. మరోవైపు బాలయ్య అప్ కమింగ్ ఫిల్మ్ లోనూ మెరియనున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా డీజే టిల్లును నిర్మించిన సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లోనే శ్రీలీల‌కు సంబంధించిన మరో 3 ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయి.

DJ Tillu

అలాగే ఇతర భాషల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో డీజే టిల్లు 2కు హీరోయిన్ గా ఎంపిక చేస్తే డేట్స్ క్లాష్ అయ్యే అవకాశం ఉందని శ్రీలీల‌నే తప్పుకున్నట్టు తెలుస్తోంది. శ్రీలీల‌ తప్పుకోవడంతో అనుపమ‌ పరమేశ్వరన్ ను ఫైనల్ చేసి షూటింగ్ ను ప్రారంభించారు. శ్రీలీల‌ కంటే అనుపమ‌కు యూత్ లో గట్టి ఫాలోయింగ్ ఉండటం, ఇటీవలనే కార్తీకేయ 2తో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకోవడంతో అనుపమ‌ను ఫైనల్ చేశారు. మొత్తంగా డీజే టిల్లు 2 హీరోయిన్ గా కేరళ కుట్టిని ఫైనల్ చేసినట్టు మేకర్స్ కన్ఫమ్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

‘నా సక్సెస్ వెనుక ఆమె ఉంది’.. వరల్డ్ కప్ ట్రోఫీతో ఇంటికి సంజు శాంసన్!

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ట్రోఫీ సాధించిన అనంత‌రం యావ‌త్ భార‌త‌దేశం సంతోషంలో మునిగిపోగా టీమిండియా ప్లేయ‌ర్లు త‌మ కుటుంబ…

Tuesday, 10 March 2026, 10:18 PM

‘ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చా’.. కువైట్ నుండి క్షేమంగా ముంబైకి ఊర్వశి రౌటేలా!

కువైట్ నుంచి తాను సుర‌క్షితంగా ఇండియాకు చేరుకున్నాన‌ని న‌టి ఊర్వ‌శి రౌటేలా వెల్ల‌డించింది. తాను ముంబైకి చేరుకున్నాన‌ని చెబుతూ ఆమె…

Tuesday, 10 March 2026, 9:24 PM

వరల్డ్ కప్ విన్నర్స్‌కు రూ.131 కోట్ల నజరానా.. బీసీసీఐ సంచలన ప్రకటన!

టీ20 వరల్డ్ కప్ 2026లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారీ…

Tuesday, 10 March 2026, 7:26 PM

ఆస్కార్స్ 2026.. ప్రెజెంటర్‌గా ప్రియాంక చోప్రా.. భారత్‌లో ఎప్పుడు చూడాలంటే?

ప్ర‌తి ఏడాదిలాగే ఈసారి కూడా ఆస్కార్ సందడి మొదలైంది. 2025 సంవ‌త్స‌రానికి ఇచ్చే ఆస్కార్ అవార్డుల కార్య‌క్ర‌మాన్ని ఈ నెల…

Tuesday, 10 March 2026, 5:34 PM

‘ఆ రుచులు వర్ణించలేం’.. భారతీయ ఆహారంపై ప్రియాంక చోప్రా క్రేజీ కామెంట్స్!

భారతదేశాన్ని తొలిసారి సందర్శించే ఎవరికైనా ఈ దేశంలోని ఆహార సంస్కృతి అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంద‌ని న‌టి ప్రియాంక చోప్రా అన్నారు.…

Tuesday, 10 March 2026, 12:40 PM

హార్దిక్ పాండ్యా ‘లక్కీ చార్మ్’.. వరల్డ్ కప్ విక్టరీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మోడల్ మహీకా శర్మ!

భారత జట్టు ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026ను గెలుచుకున్న అనంతరం క్రికెటర్ హార్దిక్ పాండ్యా వ్యక్తిగత జీవితం మరోసారి…

Monday, 9 March 2026, 10:23 PM

అమ్మకు బన్నీ అదిరిపోయే గిఫ్ట్.. మహిళా దినోత్సవం వేళ ఖరీదైన లెక్సస్ కారు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవ‌లే తన 15వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్య స్నేహా రెడ్డికి విలాసవంతమైన మెర్సిడెస్-బెంజ్…

Monday, 9 March 2026, 7:31 PM

ఐపీఎల్ 2026 డేట్ వచ్చేసింది.. ఆ రోజే తొలి మ్యాచ్! ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ ఎడిషన్ మార్చి 28, 2026న ప్రారంభం కానుంది. ఈ తేదీని అధికారిక ప్రసార…

Monday, 9 March 2026, 5:34 PM