Dil Raju : శుభవార్తను చెప్పబోతున్న దిల్ రాజు.. దీంతో ఆ లోటు తీరిపోయినట్టేనా ?

March 22, 2022 8:52 PM

Dil Raju : టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు. ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు ఇంట త్వరలోనే సంబరాలు జరగబోతున్నాయని తెలుస్తోంది. దిల్ రాజు తన మొదటి భార్య అనిత చనిపోయిన తర్వాత తన కూతురు హాన్షిత రెడ్డి కోరిక మేరకు పెద్దల సమక్షంలో వైగా రెడ్డి (తేజస్విని) అనే అమ్మాయిని రెండవ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

Dil Raju reportedly becoming father again in his 50s
Dil Raju

ఈ క్రమంలోనే వైగా రెడ్డి ప్రస్తుతం గర్భంతో ఉందని త్వరలోనే తను ఒక పండంటి బిడ్డకు జన్మ నివ్వబోతోంది అంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ విధంగా దిల్ రాజు త్వరలోనే మరోసారి తండ్రి కాబోతున్నారనే వార్త తెలియడంతో పెద్ద ఎత్తున అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే దిల్ రాజు గురించి వస్తున్నటువంటి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

ఈ విధంగా తన రెండవ భార్య వైగా రెడ్డి ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిస్తే దిల్ రాజుకు వారసుడు లేరనే లోటు దీంతో తీరిపోతుందని పలువురు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దిల్ రాజు గురించి వస్తున్న ఈ వార్తలలో ఎంత వరకు నిజముందో తెలియాలంటే ఈ వార్తలపై దిల్ రాజు స్పందించాల్సి ఉంది. ఇక ఈయన ప్రస్తుతం తెలుగు సినిమాలను మాత్రమే కాకుండా పాన్ ఇండియా చిత్రాలకు కూడా నిర్మాతగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment