Deepthi Sunaina : బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతో పాపులర్ అయిన దీప్తి సునైనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె యూట్యూబ్‌లో వీడియోలు, మ్యూజిక్ వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. తరువాత బిగ్ బాస్ షోలో పాల్గొని మరింత క్రేజ్‌ను సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈమె ఎప్పటిలాగే వీడియోలు చేస్తూ తన పనేంటో తాను చేసుకుంటోంది. ఇక సోషల్ మీడియాలోనూ ఈమె ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. అందులో తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఈమె పెట్టే పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంటాయి.
దీప్తి సునైనా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసే ఫొటోలు ఎంతగానో అలరిస్తుంటాయి. ఈమెకు ఇన్ స్టాలో 38 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఈమె పాపులారిటీ రోజు రోజుకీ మరింత పెరుగుతుందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే విడుదలైన విరాటపర్వంలోని ఒక సీన్ తాలూకు సన్నివేశాన్ని ఆమె పెట్టి అక్కడ విరాట పర్వం అని హ్యాష్ టాగ్ ఉంచింది. ఆ సీన్‌లో రవన్న (రానా) తనను కలిసేందుకు వచ్చిన వెన్నెల (సాయిపల్లవి)కి ప్రేమ అనేది ఒక అబద్ధమని చెబుతుంటాడు. సరిగ్గా అదే సీన్‌ను దీప్తి సునైనా షేర్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గతంలో షణ్ముఖ్, దీప్తి ఇద్దరూ లవ్ బర్డ్స్ అన్న విషయం తెలిసిందే. అయితే బిగ్ బాస్ షోలో షణ్ముఖ్, సిరి ఇద్దరూ చాలా క్లోజ్‌గా ఉన్నారు. దీంతో దీప్తి షణ్ముఖ్‌కు బ్రేకప్ చెప్పింది. బిగ్ బాస్ షోలో షణ్ముఖ్, సిరి ప్రవర్తించిన తీరు కారణంగానే విడిపోతున్నాం అని దీప్తి సునైనా చెప్పేసింది. అయితే ఇప్పుడు ఆమె ప్రేమ అబద్దం అనే సీన్‌ను షేర్ చేయడంపై చర్చ నడుస్తోంది. ఆమె లవ్ బ్రేకప్ వల్ల తీవ్రంగా మనస్థాపం చెందిందని.. కనుకనే ఇలాంటి పోస్ట్ పెట్టిందని అంటున్నారు. షణ్ముఖ్‌ను ఎంతగానో నమ్మిన దీప్తి బిగ్ బాస్‌లో అతని వ్యవహారం నచ్చకనే అతనికి బ్రేకప్ చెప్పింది. అయితే ఎంతో నమ్మకంగా ఉండే అతను ఇలా చేయడాన్ని తలచుకుని ఆమె ఇప్పటికీ మనస్థాపం చెందుతుందని.. కనుకనే ఇలా ప్రేమ అనేది ఒక అబద్దం అనే విషయాన్ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పేందుకే ఆమె ఇలాంటి పోస్ట్ పెట్టిందని.. దీని వల్ల షణ్ముఖ్‌కు మెసేజ్ ఇన్‌డైరెక్ట్‌గా వెళ్తుందని అంటున్నారు. ఏది ఏమైనా లవ్ బ్రేకప్ వల్ల దీప్తి సునైనా బాగా హర్ట్ అయిందనే విషయం మాత్రం స్పష్టమవుతోంది.
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను అప్‌డేట్ చేసుకునే విధానంలో మరింత సౌలభ్యాన్ని…
70 ఏళ్ల వయసున్న చిరంజీవి తాజాగా మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో నటించారు. ఈ చిత్రం జనవరి 12,…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆఫీస్ అటెండెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసి, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ…
ఖైదీ, విక్రమ్ వంటి బలమైన కంటెంట్ ఆధారిత చిత్రాలు తీసిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న లోకేష్, ఈ మార్పుతో ఆ…
నేటి రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారింది. అయితే చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో నెమ్మదిగా…
అమెజాన్ రేపటి (జనవరి 27) నుంచి సుమారు 16,000 మంది ఉద్యోగులను తొలగించనుందని సమాచారం. ఈ లేఆఫ్స్ ప్రభావం భారత్‌లోని…
పీసీసీ అధ్యక్షుడు మహేశ్ గౌడ్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో, కవిత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారని, అయితే తానే…
అనిల్ రావిపూడి తనకు అలవాటైన ఫార్ములాను విడిచిపెట్టకుండా, చిరంజీవి బలాలను చక్కగా వినియోగించుకుంటూ మరోసారి సంపూర్ణ వినోదాత్మక చిత్రాన్ని అందించారు.…