Deepthi Sunaina : అవ‌నీ పుకార్లే.. వాటిని న‌మ్మకండి: దీప్తి సునైన

January 25, 2022 7:47 AM

Deepthi Sunaina : సోష‌ల్ మీడియా ద్వారా ఎంతో పాపులారిటీని సంపాదించుకుని త‌రువాత బిగ్ బాస్‌లో మెరిసిన దీప్తి సునైన గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈమె సోష‌ల్ మీడియాలో ఎల్ల‌ప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఈమెకు చెందిన వార్త ఒక‌టి తాజాగా వైర‌ల్ గా మారింది.

Deepthi Sunaina says do not believe those fake news

ఓ ప్ర‌ముఖ సినీ నిర్మాణ సంస్థ త‌మ సినిమాలో దీప్తి సునైన‌కు ఓ లీడ్ రోల్‌ను ఆఫ‌ర్ చేసిన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఈమె త్వ‌ర‌లోనే వెండి తెర‌పై సంద‌డి చేయ‌నుంద‌ని తెలిసింది. అయితే ఆ వార్త‌ల‌ను ఆమె కొట్టి పారేసింది. అవ‌న్నీ పుకార్లేన‌ని, వాటిని న‌మ్మొద్ద‌ని తేల్చి చెప్పింది.

దీప్తి సునైన‌కు నిజానికి కుటుంబం నుంచి ఎంతో స‌పోర్ట్ ఉంది. గ‌తంలో వారు ఆమెను బాగానే ప్రోత్స‌హించారు. సోష‌ల్ మీడియాలో, సినిమాల్లో చేయ‌మ‌ని చెప్పారు. అయితే ఇప్పుడు వారే ఆమె సినిమాల్లో చేస్తానంటే వ‌ద్దంటున్నార‌ని తెలుస్తోంది. అందుక‌నే దీప్తి సునైన త‌న‌కు వ‌చ్చిన ఆఫ‌ర్ల‌ను కాద‌నుకుంటుంద‌ని స‌మాచారం. మ‌రి ఈమె వెండితెర‌పై ఎప్పుడు మెరుస్తుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment