Hyper Aadi : కొంప‌ముంచిన స్కిట్‌.. సీఎం జ‌గ‌న్ పైనే కామెంట్లా.. హైప‌ర్ ఆది చ‌నిపోయాడ‌ని పోస్టులు పెడుతున్న వైసీపీ ఫ్యాన్స్‌..!

Hyper Aadi : బుల్లితెర‌పై ప‌లు టీవీ షోల ద్వారా హైప‌ర్ ఆది ఎలా అల‌రిస్తున్నాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌పై ఆది చేసే హంగామ అంతా ఇంతా కాదు. అయితే ఈ షోలో గ‌త కొద్ది రోజులుగా ఆది క‌నిపించ‌డం లేదు. కేవ‌లం శ్రీ‌దేవి డ్రామా కంపెనీ అనే షోలోనే క‌నిపిస్తున్నాడు. అయితే గ‌తంలో జ‌బ‌ర్ద‌స్త్ వేదిక‌పై ప‌లువురు అగ్ర హీరోలు, రాజ‌కీయ నాయ‌కుల‌ను మిమిక్రీ చేస్తూ కొంద‌రు చేసిన స్కిట్స్ వివాదాస్ప‌దం అయ్యాయి. దీంతో అప్ప‌ట్లో ప‌లువురు జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్లు ఫ్యాన్స్‌కు సారీ చెప్పారు. అయితే ఆ విష‌యాన్ని మ‌రిచిపోయాడో ఏమో తెలియ‌దు కానీ.. హైప‌ర్ ఆది కూడా తాజాగా మ‌ళ్లీ అలాంటి త‌ప్పే చేశాడు. సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను అనుక‌రించి స్కిట్ చేశాడు. అయితే అది బోల్తాకొట్టింది. అది ఆదికే రివ‌ర్స్‌లో త‌గిలింది. దీంతో ఆదిని అటు వైసీపీ ఫ్యాన్స్‌, ఇటు సీఎం జ‌గ‌న్ ఫ్యాన్స్ ఒక ఆట ఆడుకుంటున్నారు. ఆది ఏకంగా చ‌నిపోయాడ‌ని పోస్టులు పెడుతూ వైర‌ల్ చేస్తున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే..

సీఎం జ‌గ‌న్ 2019లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా నేను విన్నాను.. నేను ఉన్నాను.. అనే ప‌దాల‌ను బాగా వాడారు. అయితే కేవ‌లం ప‌దాల‌ను మాత్ర‌మే కాదు.. ఆయ‌న చేసిన పాద‌యాత్ర‌.. ఇచ్చిన హామీలు న‌చ్చి జ‌నం ఆయ‌న‌ను సీఎంను చేశారు. అయితే ఇటీవ‌ల స‌ర్కారు వారి పాట చిత్రంలో మ‌హేష్ కూడా అవే డైలాగ్స్‌ను వాడారు. దీంతో వైసీపీ ఫ్యాన్స్ మ‌హేష్‌ను మెచ్చుకున్నారు. అయితే ఆ డైలాగ్‌ల‌ను సీరియ‌స్‌గా వాడాలి కానీ.. కామెడీ కోసం వాడకూడ‌దు. ఆ విష‌యం కూడా తెలియ‌కుండా హైప‌ర్ ఆది.. తాజాగా విడుద‌ల చేసిన శ్రీ‌దేవి డ్రామా కంపెనీ ప్రోమోలో ఇవే డైలాగ్‌ల‌ను వాడాడు.

Hyper Aadi

మేము ఉన్నాం.. అని ఒక యువ‌కుడు ఈ ప్రోమోలో అన‌గా.. ఇంకొక యువ‌కుడు మేము విన్నాం అంటాడు. దీంతో హైప‌ర్ ఆది.. స‌రే మేము ఉంటాం.. అంటూ అక్క‌డి నుంచి వెళ్లిపోతాడు. ఇలా డైలాగ్‌లు చెప్ప‌డంతో ఆదిపై వైసీపీ ఫ్యాన్స్, కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. ఆదిని విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఆదిపై భారీ స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. ఆది ఏకంగా చ‌నిపోయాడ‌ని పోస్టులు పెడుతూ వాటిని వైర‌ల్ చేస్తున్నారు. అయితే దీనిపై ఆది స్పందించాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM