Kangana Ranaut : బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఏం చేసినా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంటుంది. అందుకు గల కారణం ఈమె చేసే ట్వీట్స్ అని చెప్పవచ్చు. గత కొద్ది రోజుల క్రితం కంగనారనౌత్ భారత స్వాతంత్రోద్యమం, మహాత్మా గాంధీ పై చేసిన వ్యాఖ్యలు సర్వత్రా విమర్శలకు కారణమవుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు ఈమె వ్యాఖ్యలపై స్పందిస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్వాతంత్ర ఉద్యమం గురించి కంగనా మాట్లాడిన వ్యాఖ్యలపై జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లో ఏకంగా ఈమెపై దేశ ద్రోహ కేసులు నమోదు చేశారు.
గత కొన్ని రోజుల క్రితం ఈమె భారత స్వాతంత్రోద్యమంపై సంచలన వ్యాఖ్యలు చేయగా తాజాగా మహాత్మాగాంధీని లక్ష్యంగా చేసుకొని ఎన్నో విమర్శలు చేశారు. ఒక చెంప చూపిస్తే స్వార్థం కాదు కేవలం భిక్ష మాత్రమే వస్తుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు స్పందిస్తూ తన వ్యాఖ్యలను తీవ్రస్థాయిలో ఖండించారు.
ఆమె కేవలం తన వ్యాఖ్యలతోనే దేశ పరువుకు నష్టం కలిగిస్తుందని.. ఈ క్రమంలోనే ఆమెపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
కాగా కంగనా పై జార్ఖండ్‌లోని పండర్‌పాలా నివాసి ఇజార్ అహ్మద్ ధన్‌బాద్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణకు రానుంది. అదేవిధంగా బీహార్‌లో కూడా ఈమెపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. అది ఈ నెల 22వ తేదీన విచారణకు రానుంది.
ఇలా భారత స్వాతంత్రం గురించి, స్వాతంత్ర యోధుల గురించి ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలను ఖండిస్తూ ఈమెపై చర్యలు తీసుకోవాలని.. డిమాండ్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…