Chiranjeevi : ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్వయంకృషితో పైకి వచ్చిన స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. అందుకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అగ్రస్థాయి హీరోగా ఎదిగారు. ప్రాణం ఖరీదు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అందులో ఒకటి మహేశ్వరి పరమేశ్వరి బ్యానర్ పై నిర్మాత సుబ్బిరామిరెడ్డి సారథ్యంలో విడుదలైన చిత్రం స్టేట్ రౌడీ. ఈ స్టేట్ రౌడీ చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం వహించారు. చిరంజీవి సరసన భానుప్రియ, రాధ హీరోయిన్లుగా నటించి అందరినీ అలరించి మెప్పించారు.
మార్చి 23, 1989లో భారీ అంచనాలతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదలైన మొదటి రోజుల్లో ఈ చిత్రం ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ ఇదే చిత్రం కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించింది. అప్పట్లో స్టేట్ రౌడీ చిత్రం నైజాంలో కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ ను వసూలు చేసింది. స్టేట్ రౌడీ విడుదలైన సమయంలోనే బిగ్ బి అమితాబ్ బచ్చన్ బాలీవుడ్ లో సూపర్ స్టార్ గా మంచి క్రేజ్ లో ఉన్నారు. ఆ టైం లో అమితాబ్ బచ్చన్ సినిమాలు అంటే నిర్మాతలకు కనకవర్షం కురిపించేవి. కానీ చిరంజీవి స్టేట్ రౌడీ చిత్రంతో అమితాబచ్చన్ చిత్ర కలెక్షన్లను మించి వసూలు రాబట్టుకున్నారు. అప్పట్లో ఈ విషయం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ భారీ కలెక్షన్లు సంపాదించడంతో ట్రేడ్ గైడ్ అనే మ్యాగజిన్ స్టేట్ రౌడీ చిత్రం కలెక్షన్ల గురించి వివరిస్తూ వేర్ ఈజ్ అమితాబ్ అంటూ ప్రశ్నిస్తూ ఆర్టికల్ విడుదల చేసింది. అప్పటిలో ఈ మ్యాగజైన్ చదివిన హిందీ ప్రముఖులు సైతం వేర్ ఈజ్ అబితాబ్ అనే పదాన్ని చదివి ఎంతో ఆశ్చర్యాన్ని వ్యక్తం చేయడం జరిగిందట. ఆ సమయంలో స్టేట్ రౌడీ చిత్రం దేశం మొత్తం రికార్డుల పరంగా సంచలనం సృష్టించింది. అంతేకాకుండా వంద రోజుల వేడుకను ఘనంగా జరుపుకోవడంతోపాటు చిరంజీవి కెరియర్లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది ఆ మూవీ.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…