Chiranjeevi : టాలీవుడ్ కి ఇద్దరు అద్భుతమైన దర్శకులను అందించిన ఘనత ప్రతాప్ ఆర్ట్స్ ప్రొడక్షన్ అధినేత కే రాఘవ గారికే దక్కుతుంది. కే రాఘవ నిర్మాణ సారథ్యంలో తాత మనవడుతో దాసరి నారాయణరావు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో కోడి రామకృష్ణ దర్శకులుగా పరిచయమయ్యారు. దాసరి నారాయణరావుకి కోడి రామకృష్ణ శిష్యుడు కావడం మరొక విశేషం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రం 1982 ఏప్రిల్ 23న వేసవి బరిలో దిగి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ చిత్రంలో చిరంజీవి రాజశేఖరం గాను, హారోయిన్ మాధవి జయలక్ష్మి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. పూర్ణిమ, పి.ఎల్.నారాయణ, గొల్లపూడి మారుతీ రావు, సంగీత తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కోడి రామకృష్ణ తొలిసారిగా దర్శకత్వం వహించగా, మాటల రచయిత గొల్లపూడి మారుతీరావు నటుడిగా తొలిసారి ఈ చిత్రంతో పరిచయమయ్యారు.
ఇక కథలోకి వెళ్తే రాజశేఖరం (చిరంజీవి) ఒక సివిల్ ఇంజనీరు. ఓ పనిమీద పల్లెటూరికి వచ్చి జయలక్ష్మి (మాధవి) ప్రేమ మాయలో పడతాడు. వారిద్దరూ పెళ్ళి చేసుకుని నగరానికి వచ్చి కొత్త కాపురం పెడతాడు. పైకి మంచి మాటలు మాట్లాడుతూ లోపల కుటిల బుద్ది ప్రవర్తన గల సుబ్బారావు(గొల్లపూడి) జయలక్ష్మి(మాధవి) మీద కన్నేస్తాడు. మాయమాటలు చెప్పి ఎంతోమంది అమాయక ఆడవాళ్ళని మోసం చేస్తాడు సుబ్బారావు. జయలక్ష్మికి రాజశేఖరం మీద లేనిపోనివన్నీ చెప్పి ఆ జంటను విడదీస్తాడు సుబ్బారావు. ఈ సమస్యలన్నింటికీ ఆ జంట ఎలా పరిష్కారం చూపిస్తారు అన్నదే ఈ చిత్ర కథాంశం.
అప్పట్లో ఈ చిత్రాన్ని కేవలం 29 రోజుల్లోనే కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూ.3లక్షల 20వేల వ్యయంతో ఈ చిత్రానికి పాలకొల్లు, నర్సాపురం, పోడూరు, సఖినేటిపల్లి, భీమవరం, మద్రాస్‌లలో సినిమా షూటింగ్స్ జరిపారు. సినిమా పనులు పూర్తయ్యాక సెన్సార్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్న రాఘవ పట్టుదలతో పోరాడి సెన్సార్ ఇబ్బందుల నుంచి బయటపడ్డారు. ఈ సినిమాతో గట్టి పునాది వేసుకున్న దర్శకుడు కోడిరామకృష్ణ ఆ తరువాత స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో ఎదిగారు.
1982 ఏప్రిల్ 23న విడుదలైన ఈ సినిమాకి మొదట యావరేజ్ టాక్ వచ్చినప్పటికీ ఆ తరువాత కాలక్రమేణా ప్రేక్షకాదరణ పెరిగి సూపర్ హిట్ గా నిలిచింది. 8 కేంద్రాల్లో 50 రోజులు, కొన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడి మంచి కలెక్షన్లు రాబట్టింది. హైదరాబాద్ సిటీ లో ఈ సినిమా ఏకంగా 512వ రోజు వరకు ఆడింది. అప్పటికే యాక్షన్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న చిరంజీవిని రాజశేఖర్ అనే హాస్యం మేళవించిన ఫ్యామిలీ మ్యాన్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించడం అంత తేలికైన విషయం ఏమీ కాదు. ఈ చిత్రంతో చిరంజీవి యాక్షన్ హీరోగానే కాదు, ఫ్యామిలీ హీరోగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…