Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలయ్య బాబు ఇద్దరూ ఇండస్ట్రీకి రెండు కళ్ల వంటి వారు. ఇద్దరూ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించారు. 1990వ దశాబ్దంలో వీరి సినిమాల మధ్య ఎంతో పోటీ ఉండేది. ప్రేక్షకులు కూడా బాలయ్య మాస్ యాక్షన్ ని, చిరంజీవి అదిరిపోయే డ్యాన్స్ ని ఎంతో ఇష్టపడేవారు. ఎన్నో రకాల కొత్త కథాంశాలతో పోటాపోటీగా చిత్రాల్లో నటించేవారు. అభిమానుల్లో బాలయ్యకు, చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తమ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను మనసులను దోచుకున్నారు.
ఇక వీరిద్దరి సినిమాల్లో కథానాయికగా నటించిన అందాల భామ హీరోయిన్ రాధ. ఈమె మలయాళీ అయినా, తెలుగు ప్రేక్షకులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. చిరంజీవితో గుండా, దొంగ, అడవి దొంగ, కొండవీటి రాజా, కొండవీటి దొంగ, రాక్షసుడు, యముడికి మొగుడు, స్టేట్ రౌడీ, కొదమ సింహం వంటి చిత్రాల్లో చిరంజీవికి ధీటుగా రాధ నటించింది. ఇక బాలయ్యతో ముద్దుల కృష్ణయ్య, రాముడు భీముడు, దొంగరాముడు, రక్తాభిషేకం వంటి చిత్రాలు ఎన్నో హిట్స్ అందుకుని స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఈమె కెరీర్ ముగుస్తున్న దశలో రాజశేఖర్ అనే బిజినెస్న్ మ్యాన్ ని వివాహం చేసుకొని స్థిరపడింది.
అసలు ఈ ముగ్గురు గురించి ఎందుకు చెబుతున్నారా అని ఆలోచిస్తున్నారా.. ఈ ముగ్గురు మధ్య ఓ ఆసక్తికర పోలిక వుంది. అదేమిటంటే చిరు, బాలయ్య ఇద్దరు పాలిటిక్స్ లో ఉండడం. ఇక ముగ్గురికి ముగ్గురేసి పిల్లలు ఉన్నారు. చిరుకి సుస్మిత, శ్రీజ అనే ఇద్దరు అమ్మాయిలు, రామ్ చరణ్ అనే ఓ అబ్బాయి. బాలయ్యకు కూడా బ్రాహ్మణి, తేజస్విని అనే ఇద్దరు అమ్మాయిలు, మోక్షజ్ఞ అనే ఓ అబ్బాయి. అలాగే రాధకు కూడా ముగ్గురు పిల్లలే. అది కూడా ఈమెకు ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉండటం విశేషమే.
చిరు, బాలయ్య కూతుర్లు సినీ రంగానికి దూరంగా ఉండడం కూడా ఓ కామన్ పాయింట్. చిరు కుమారుడు రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇక బాలయ్య కొడుకు మోక్షజ్ఞ హీరోగా సినీ ఆరంగేట్రం చేయడానికి సిద్ధంగా వున్నాడు. ఇది యాదృచ్ఛమే అనుకోవాలి. ఎందుకంటే ఇద్దరికీ ఇద్దరేసి అమ్మాయిలు, ఒక్కో అబ్బాయి. కానీ రాధ పెద్ద కూతురు కార్తీక తమిళ, మలయాళ, తెలుగు చిత్రాలతో అందరిని ఆకట్టుకుని హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రెండో కూతురు తులసి కూడా తమిళ చిత్రాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. అయితే కొడుకు విగ్నేష్ మాత్రం సినీ రంగానికి దూరంగా ఉంటూ, తండ్రి బాటలోనే వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…