Charmy Kaur : పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన మూవీ లైగర్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించారు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఈ సినిమాకు ఛార్మి నిర్మాతగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా భారీ అంచనాలతో గురువారం రిలీజ్ అయింది. లైగర్ మూవీ రిలీజ్ కి ముందు పూరీ బ్యాచ్ చేసిన హడావిడి మనకు తెలిసిందే. ఈ సినిమాతో ఇండియా షేక్ అవుద్ది. వాట్ లగా దేంగే.. ఆగ్ లగా దేంగే.. అంటూ విజయ్-పూరీలు చేసిన హంగామా మాములుగా లేదు.
పైగా విజయ్ అయితే సినిమా చూస్తే చూడండి లేదంటే లేదు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడాడు. సినిమా విషయంలో టీం అంతా ఓవర్ కాన్ఫిడెంన్స్ తో ఉంది. మూవీపై చివరకు తీర్పు చెప్పాల్సింది ఆడియెన్స్. ప్రీమియర్స్ టాకే తేడా కొట్టింది. ఇక ఇప్పుడు రివ్యూయర్లు కూడా లైగర్‌ను లైట్ తీసుకున్నారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు లైగర్‌ను ఏకిపారేస్తున్నారు. ఈ క్రమంలో ఛార్మి టార్గెట్ అయింది. గతంలో ఛార్మి చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు కొంప ముంచేసింది. బ్రూస్‌లీ సినిమా విడుదలైన రోజు ఛార్మి ఓ ట్వీట్ చేసింది. అది బ్రూస్ లీ సినిమా డిజాస్టర్ అయినందుకు చేసిన ట్వీటా ? మరే ఉద్దేశ్యంతోనైనా ఛార్మీ ట్వీట్ చేసిందా ? అన్నది తెలియడం లేదు.
కానీ ఇప్పుడు మాత్రం జనాలు దానికి దీనికి లింక్ చేస్తున్నారు. బ్రూస్ లీ సినిమా పోయిందని ఛార్మీ ఇలా ట్వీట్ చేసిందని, ఆ చిత్రం పోయినందుకే పూరీ బ్యాచ్ పార్టీలు చేసుకున్నారని టాక్. అయితే ఇప్పుడు ఛార్మీ మీద నెటిజన్లు మండి పడుతున్నారు. నాడు పగలబడి నవ్వావ్.. నేడు మీ సినిమా కూడా పోయింది.. ఇప్పుడు నవ్వు అంటూ ఛార్మీ మీద సెటైర్లు వేస్తున్నారు. నాడు ఛార్మి చేసిన ట్వీట్ కి ఈ రోజు ఇలా ఛార్మి బలి కావాల్సి వస్తోంది. నెటిజన్లు ఛార్మి మీద రకరకాల కామెంట్లతో రెచ్చిపోతోన్నారు. వైరల్ అవుతున్న ట్వీట్ గురించి ఛార్మి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…