Chanakya Niti : చాణక్యుడు ఎంతో జ్ఞానం, ముందు చూపు కలిగిన వ్యక్తి. ఇప్పటి తరానికి ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా చాణిక్య నీతి ద్వారా జవాబు దొరుకుతుంది. చాణిక్యుడు ఆర్థికపరమైన, సామాజికపరమైన, వ్యక్తిగత పరమైన అంశాల గురించి చాణిక్య నీతి ద్వారా సమాజానికి తెలియజేశారు. చాణక్య నీతిలో జీవిత విధానాల గురించి ప్రస్తావించబడింది. చాణక్య నీతి విధానం ప్రకారం మీరు మీ స్నేహితులకు ఎప్పుడూ చెప్పకూడని కొన్ని విషయాల గురించి చాణిక్య నీతిలో చెప్పబడిన దాని గురించి తెలుసుకుందాం.
నీ స్నేహితుడిని బట్టి నీ గుణం ఎలాంటిదో తెలుస్తుందని చాణిక్యుడు చాణిక్య నీతి ద్వారా తెలియజేశారు. మనకు ఎలాంటి సమస్య వచ్చినా ముందు ఇంట్లోవారి కన్నా స్నేహితులతో ఎక్కువగా పంచుకుంటాం. కానీ స్నేహితుడికి కూడా చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. ఎంత ప్రాణ స్నేహితుడైన కానీ చాణక్యుడి నీతి ప్రకారం వ్యాపారంలో నష్టం వచ్చినా, ఆర్థికంగా నష్టపోయినా ఆ విషయాల గురించి ఎంత ప్రాణ స్నేహితుడైన గానీ చెప్పకూడదు. ఇది తెలిసిన తరువాత స్నేహితులైనా సరే అతనికి సహాయం చేయడానికి భయపడతారు. అందువల్ల మీ జీవితంలో దీన్ని ఎల్లప్పుడూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.
మీ భార్య లేదా స్నేహితురాలు అలవాట్ల గురించి అవతలి వ్యక్తికి చెప్పకండి. చాణక్యుడి నీతి ప్రకారం మనిషి తన విచారకరమైన విషయాలను కూడా రహస్యంగా ఉంచాలి. ఎందుకంటే మీ వ్యక్తిగత విషయాల గురించి చెప్పిన తర్వాత ప్రజలు సంతోషంగా లేని వ్యక్తిని ఎగతాళి చేస్తారు. ఇతరుల ముందు మిమ్మల్ని అవమానించి మీ ప్రతిష్టను తగ్గించడానికి చూస్తూ ఉంటారు. మీ గురించి ఇతరులతో చెప్పడం ద్వారా ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని అవమానించడానికి చూస్తుంటారు. ఎప్పటికీ ఇలాంటి విషయాలను ఇతరులతో పంచుకోవద్దు.
అదేవిధంగా ఎటువంటి బాధ ఉన్నా కానీ మీరు ఎంతగానో నమ్ముతున్న వ్యక్తితో మాత్రం ఆ బాధను పంచుకోవద్దు. ఇలా పంచుకోవడం వల్ల మీ సమస్యకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ మీలో ఉన్న వీక్‌నెస్ ని పసిగడతారు. ఆ వీక్‌నెస్ తెలుసుకొని మీతో ఆడుకోవడం మొదలుపెడతారు. అందుకే ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. అదేవిధంగా ఎవరిని ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్మాలని చాణక్యుడు చెప్పాడు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…