Bro Daddy Movie Review : బ్రొ డాడీ.. మోహ‌న్‌లాల్‌ మ‌ళ‌యాళం మూవీ రివ్యూ..!

Bro Daddy Movie Review : మ‌ళ‌యాళం సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ న‌టించిన బ్రొ డాడీ మూవీ బుధ‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ మూవీని నేరుగా ఓటీటీలోనే విడుద‌ల చేశారు. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమ్ అవుతోంది. న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ మోహ‌న్‌లాల్‌తో క‌లిసి లూసిఫ‌ర్ త‌రువాత ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సినిమా కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో భారీగానే అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రి బ్రొ డాడీ మూవీ అంచ‌నాల‌ను అందుకుందా.. ఎలా ఉంది ? అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌థ..

జాన్ క‌ట్ట‌డి (మోహ‌న్ లాల్) అన్న‌మ్మ (మీనా సాగ‌ర్‌)లు అన్యోన్య‌మైన దంప‌తులు. 25 ఏళ్లుగా ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తుంటారు. వారికి ఒకే ఒక్క కుమారుడు ఈశో (పృథ్వీరాజ్ సుకుమార‌న్‌). అత‌ను బెంగ‌ళూరులో ఓ అడ్వ‌ర్ట‌యిజింగ్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. ఇక కురియ‌న్ (లాలు అలెక్స్) జాన్ క‌ట్ట‌డి ఫ్యామిలీ ఫ్రెండ్‌. అన్నా (క‌ల్యాణి ప్రియ‌దర్శన్‌) అత‌ని కుమార్తె. ఈమె కూడా బెంగ‌ళూరులోనే ప‌నిచేస్తుంటుంది. అయితే ఈశో, ఆమె లివిన్ రిలేష‌న్‌షిప్‌లో ఉంటారు. కానీ ఇరు కుటుంబాల‌కు ఆ విష‌యం తెలియ‌దు. అక‌స్మాత్తుగా వారి లైఫ్ చేంజింగ్ సంఘ‌ట‌న చోటు చేసుకుంటుంది. అస‌లు ఆ సంఘ‌ట‌న ఏమిటి ? వారు త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు త‌మ కుటుంబాల‌ను ఎలా చేరుకున్నారు ? త‌రువాత ఏం జ‌రిగింది ? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు తెలుసుకోవాలంటే.. బ్రొ డాడీ మూవీని చూడాల్సిందే.

ప్ల‌స్ పాయింట్స్‌..

మోహ‌న్‌లాల్ మ‌రోసారి ఇందులో త‌న అద్భుత‌మైన న‌ట‌న‌ను ప్ర‌ద‌ర్శించారు. ఆయ‌న న‌ట‌న‌కు అస‌లు ఎలాంటి వంక పెట్టాల్సిన ప‌నిలేదు. త‌న‌కు ఇచ్చిన పాత్ర‌లో ఆయ‌న జీవించారు. త‌న కామెడీ టైమింగ్ కూడా ఆక‌ట్టుకుంటుంది. అలాగే పృథ్వీరాజ్ కూడా చ‌క్క‌ని ప్ర‌దర్శ‌న ఇచ్చాడు. లాలు అలెక్స్ త‌న పాత్ర‌లో జీవించారు. క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ త‌న పాత్ర‌కు న్యాయం చేశారు. మీనా, క‌ణిహ‌లు కూడా త‌మ పాత్ర‌ల ప‌రిధుల మేర న‌టించారు.

పృథ్వీరాజ్ చాలా సీరియ‌స్ విష‌యాన్ని కామెడీగా చెప్ప‌డంలో విజ‌యం సాధించాడ‌నే చెప్ప‌వ‌చ్చు. ఆయ‌న కామెడీని, ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా హ్యాండిల్ చేశారు. ప్రేక్ష‌కులు తెర వైపు క‌ళ్లార్ప‌కుండా చూస్తారంటే అతిశ‌యోక్తి కాదు.

మైన‌స్ పాయింట్లు..

సినిమా క‌థ పాత‌దే అయిన‌ప్ప‌టికీ ద‌ర్శ‌కుడు కొత్త‌గా చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేశాడు. అయితే మొద‌టి హాఫ్ లో స్క్రీన్ ప్లే వేగంగా సాగుతుంది. సెకండ్ హాఫ్‌లో స్పీడ్ త‌గ్గుతుంది. క్లైమాక్స్‌లో మ‌ళ్లీ స్పీడ్ పెరుగుతుంది. కొన్ని సీన్లు సెకండాఫ్‌లో బోరింగ్‌గా అనిపిస్తాయి. లెంగ్త్ ఎక్కువైన‌ట్లు అనిపిస్తుంది. అలాగే ఉన్ని ముకుంద‌న్‌, సౌబిన్ ష‌హ‌ర్‌ల సీన్లు మెయిన్ క‌థ‌కు అడ్డంకిగా అనిపిస్తాయి.

టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే.. చ‌క్క‌ని ప్రొడ‌క్ష‌న్ విలువ‌ల‌తో సినిమాను నిర్మించారు. సినిమాటోగ్రాఫ‌ర్ అభినంద‌న్ రామానుజ‌మ్ చ‌క్క‌గా వ‌ర్క్ చేశారు. చ‌క్క‌ని విజువ‌ల్స్‌ను అందించారు. అలాగే దీప‌క్ దేవ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆక‌ట్టుకుంటుంది. స్టోరీకి త‌గిన మ్యూజిక్‌ను ఇచ్చారు. అఖిలేష్ మోహ‌న్ ఎడిటింగ్ బాగుంది. చివ‌ర‌గా.. న‌టుడు పృథ్వీరాజ్ ద‌ర్శ‌కుడిగా రెండోసారి త‌న‌ను తాను నిరూపించుకున్నార‌నే చెప్ప‌వ‌చ్చు.

తీర్పు..

బ్రొ డాడీ మూవీ ఫ్యామిలీ డ్రామా నేప‌థ్యంలో సాగుతుంది. ద‌ర్శ‌కుడు సీరియ‌స్ విష‌యాన్ని కామెడీగా చెప్పాడు. చివ‌ర‌కు ఎమోష‌న‌ల్ గా ఉంటుంది. అందువ‌ల్ల కుటుంబంతో క‌లిసి ఈ మూవీని స‌ర‌దాగా ఒక‌సారి చూడ‌వ‌చ్చు. చ‌క్క‌ని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను పొంద‌వ‌చ్చు.

మూవీ : బ్రొ డాడీ (మ‌ళ‌యాళం, డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌)

న‌టీన‌టులు : మోహ‌న్ లాల్‌, పృథ్వీ రాజ్ సుకుమార‌న్‌, మీనా సాగ‌ర్‌, క‌ల్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, లాలు అలెక్స్‌, క‌ణిహ‌, సౌబిన్ ష‌హ‌ర్‌, ఉన్ని ముకుంద‌న్ త‌దిత‌రులు

ద‌ర్శ‌కుడు : పృథ్వీ రాజ్ సుకుమార‌న్

నిర్మాత : ఆంటోనీ పెరంబ‌వూర్

సంగీతం : దీప‌క్ దేవ్

సినిమాటోగ్ర‌ఫీ : అబినంద‌న్ రామానుజ‌మ్

ఎడిట‌ర్ : అఖిలేష్ మోహ‌న్

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM