Brahmanandam : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ బ్రహ్మానందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన కామెడీ ద్వారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. కొన్ని సినిమాలు బ్రహ్మానందం కామెడీకే సూపర్ హిట్ అయ్యాయి అంటే ఆయన ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకున్నారో అర్థమవుతుంది. అయితే ఈ మధ్యకాలంలో కొన్ని అనారోగ్య పరిస్థితుల కారణంగా బ్రహ్మానందం ఎక్కువగా సినిమాలలో నటించడం లేదు.
తాజాగా హరీష్ వడత్యా దర్శకత్వంలో శ్రీకాంత్, సంగీత ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం తెలంగాణ దేవుడు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ క్రమంలోనే ఇందులో బ్రహ్మానందం ఒక కీలకమైన పాత్రలో నటించారు. ఈ సినిమా విడుదలైన సందర్భంగా బ్రహ్మానందం సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.
ఈ వీడియోలో బ్రహ్మానందం సినిమా గురించి మాట్లాడుతూ.. తనని ఒక కమెడియన్ గా కూడా చూడకుండా ఎంతో కీలకపాత్రలో నటించే అవకాశాన్ని కల్పించారు అంటూ వెల్లడించారు. అయితే ఈ వీడియోలో బ్రహ్మానందాన్ని చూస్తే మాత్రం అందరూ షాక్ అవ్వాల్సిందే. ఈయన అనారోగ్యం కారణంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే శరీరం మొత్తం వదులుగా మారిపోయి ఉండడంతో చాలామంది బ్రహ్మానందం ఏంటి ఇలా మారిపోయారు.. అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…