Bimbisara : బింబిసార సినిమా ఎటువంటి భారీ అంచనాలు లేకుండానే విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మరొకసారి రుజువు చేశారు. చాలా రోజుల తరువాత కళ్యాణ్ రామ్ ఖాతాలో మంచి హిట్ వచ్చి చేరింది. మొదటి సినిమా అయినప్పటికీ దర్శకుడు వశిష్ట్ తనని తాను నిరూపించుకున్నాడు. ఇక బింబిసార విడుదల అయిన రెండో రోజే దీనికి రెండవ భాగం చేయనున్నట్లు ఈ చిత్ర హీరో దర్శకులు ప్రకటించారు. ఇక అప్పుడే దీనిపై రకరకాల ఊహాగానాలు వ్యాపిస్తున్నాయి.
అయితే ఈ ఊహాగానాల్లో భాగంగా బింబిసార 2 మూవీలో కళ్యాణ్ రామ్ ను ఢీకొట్టే విలన్ పాత్రలో ఒక ప్రముఖ నటి చేయనుందని ప్రచారం చేయడం మొదలుపెట్టారు. కానీ దర్శకుడు దీనిపై స్పష్టతనిచ్చేందుకు త్వరగా స్పందించారు. ఆయన ఈ అపోహలను కొట్టిపారేస్తూ.. తాము బింబిసార సీక్వెల్ గురించి కేవలం ఆలోచన మాత్రమే చేశామని, దానికి సంబంధించిన వివరాలేవీ ఇంకా అనుకోలేదని తెలియజేశారు.
అయితే అంతకు ముందు బింబిసార సినిమాకు ప్రీక్వెల్ గా బింబిసార 2 ను తీయాలనే ఆలోచన వచ్చిందని, ఆ కథ బింబిసారుడి గతంలో ఆయన ఉన్నత స్థితిని అలాగే అతని పతనాన్ని తెలిపే విధంగా మొదటి భాగానికి ముందు జరిగిన సంఘటనలన్నీ అందులో ఉండేలా ఉటుందని చెప్పారు. ఇంకా 2వ భాగంలో చాలా యుద్ధ సన్నివేశాలలో కూడి ఉంటుందని తెలిపారు.
కానీ ఇందులో ఉండబోయే పాత్రలను గానీ వాటిని చేయబోయే నటీనటులను గానీ ఇంకా నిర్ణయించలేదని వివరణ ఇచ్చారు. ఇక కళ్యాణ్ రామ్ ఇదివరకు బింబిసార మొదటి భాగం హిట్ అయితే రెండవ భాగం ఉంటుందని ప్రకటించినట్లుగానే సీక్వెల్ రావడం ఖాయం అయ్యిందని, కాబట్టి ఇప్పుడు వారిపై ఒత్తిడి ఇంకా ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
హై బ్లడ్ ప్రెజర్ (Hypertension) సమస్యను నియంత్రించడంలో ఉప్పు వినియోగం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య సంస్థలు, శాస్త్రీయ…
దేశీయ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా తన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) విభాగంలో ఉద్యోగాల భర్తీకి…
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన తాజా చిత్రం ది రాజా సాబ్ ఓటీటీ విడుదలకు సిద్ధమవుతోంది. జనవరి 9,…
బాలీవుడ్లో పెద్దగా హైప్ లేకుండా విడుదలై, విడుదల అనంతరం మాటామాటా ప్రచారంతో సంచలన విజయాన్ని నమోదు చేసిన చిత్రం ధురంధర్.…
గత ఏడాదికి పైగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డూ వివాదం ప్రధాన చర్చాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై…
సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం పెరిగిన ఈ కాలంలో సెలబ్రిటీల గుర్తింపు, పేరు, ఫోటోలు, వీడియోలు దుర్వినియోగానికి గురవడం…
రైలు పట్టుకోవాలనే తొందరలో, ఆన్లైన్ బుకింగ్‌లో పొరపాటు వల్ల, లేదా చివరి నిమిషంలో ఏర్పడిన గందరగోళంతో.. కొన్నిసార్లు ప్రయాణికులు టికెట్…
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల…