Bigg Boss Telugu 6 : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 ప్రారంభం అయ్యే తేదీ అదే..?

June 22, 2022 8:24 AM

Bigg Boss Telugu 6 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రించిన షోల‌లో బిగ్ బాస్ ఒక‌టి. ఈ మ‌ధ్యే ఈ షోకు చెందిన ఓటీటీ వెర్ష‌న్ ముగిసింది. కానీ దీనికి పెద్ద‌గా ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. ఇందులో బిందు మాధ‌వి విన్న‌ర్‌గా నిలిచింది. ఇందులో విన్ అయిన కంటెస్టెంట్ల‌ను నేరుగా బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 6కు ప్ర‌మోట్ చేస్తామ‌ని చెప్పారు. అందులో భాగంగానే వీరితోపాటు మిగిలిన కంటెస్టెంట్ల కోసం కూడా ప్ర‌స్తుతం నిర్వాహ‌కులు వెతుకుతున్నారు. అయితే బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 6 త్వ‌ర‌లోనే ప్ర‌సారం అవుతుంద‌ని ఇటీవ‌లే నాగార్జున చెప్పారు. ఇక ఈసారి కూడా ఆయ‌నే ఈ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇక ప్ర‌స్తుతం ఈ షోకు గాను కంటెస్టెంట్ల కోసం చూస్తున్నారు.

అయితే ఈసారి షోలో కామ‌న్ మాన్ ఒక‌రు పాల్గొంటార‌ని ఇదివ‌ర‌కే చెప్పారు. ఈ క్ర‌మంలోనే కామ‌న్ మాన్ ఎంట్రీ కోసం ఒక వారం పాటు ప‌లు టాస్క్‌ల‌ను ఇస్తార‌ట‌. వాటిల్లో అత్యుత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చిన కామ‌న్ మ్యాన్‌ను షోలోకి తీసుకుంటార‌ట‌. ఇక ఈ షోను సెప్టెంబ‌ర్ 4వ తేదీ నుంచి ప్ర‌సారం చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ ఇది అధికారికంగా వెల్ల‌డించిన తేదీ కాదు. క‌నుక ఇందులో ఎంత నిజం ఉంది.. అన్న‌ది మాత్రం ఇప్పుడే చెప్ప‌లేం. కాక‌పోతే సోష‌ల్ మీడియాలో మాత్రం ఇదే తేదీ క‌న్‌ఫామ్ అని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

Bigg Boss Telugu 6 launch date social media viral
Bigg Boss Telugu 6

ఇక ఈ సారి సీజ‌న్‌లో అనిల్‌, మిత్ర‌, శివ‌, అమర్‌దీప్‌, ఆది, చైత్ర రాయ్‌, దీప్తి పిల్లి, న‌వ్య స్వామి, వ‌ర్షిణి, యాంక‌ర్ ధ‌నుష్ వంటి వారు పాల్గొంటార‌ని స‌మాచారం. అలాగే హిందీ బిగ్ బాస్ నుంచి ప‌లు టాస్క్‌ల‌ను తీసుకుని ఈ సారి సీజ‌న్‌లో వాటిని ప‌లుమార్లు అమ‌లు చేయ‌నున్నార‌ని స‌మాచారం. దీంతో ఈ సారి సీజ‌న్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంద‌ని తెలుస్తోంది. అలాగే కొన్ని ఎపిసోడ్ల‌ను ఓటీటీలోనూ లైవ్ స్ట్రీమ్ చేస్తార‌ని.. కేవ‌లం డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ అకౌంట్ ఉన్న‌వారే ఈ లైవ్ స్ట్రీమ్ ను చూసేలా ఏర్పాట్లు చేస్తార‌ని తెలుస్తోంది. ఇక దీనిపై మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment