Bigg Boss 5 : బిగ్ బాస్ సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్స్ మాదిరిగా కంటే ఈ సీజన్‌లో కొంత మసాలా ఎక్కువైంది. ఛాన్స్ దొరికితే గొడవలకు దిగుతున్నారు. మరోవైపు చిత్ర విచిత్రమైన టాస్క్‌లతో హౌస్ మేట్స్ మధ్య చిచ్చు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇప్పటికే రకరకాల గొడవలతో రచ్చ రచ్చగా ఉన్న బిగ్ బాస్ హౌస్ తాజాగా మరోసారి హీటెక్కింది.
సోమవారం వచ్చిందంటే నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా నడుస్తుందనే విషయం తెలిసిందే. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ హౌజ్ వాతావరణం వేడెక్కేలా చేస్తుంటారు. ముందు నుండి బద్ధ శత్రువులుగా వ్యవహరిస్తున్న శ్రీరామ్, మానస్ మరోసారి నామినేషన్ ప్ర్రక్రియలో మాటల దాడి చేసుకున్నారు. ప్రతివారం ఎవరో ఒకరు వెళ్లిపోవాలని, నువ్వెళ్లిపోయినా నాకు ఫరఖ్ పడదంటూ శ్రీరామ్‌ను నామినేట్ చేశాడు మానస్. నువ్వు ఉన్నా ఫరఖ్ పడదని కౌంటరిచ్చాడు శ్రీరామ్.
ఆ తర్వాత శ్రీరామ్.. మానస్‌ని నామినేట్ చేస్తూ.. నీకు నాతో ప్రాబ్లమ్ ఏంటో అర్ధం కావడం లేదు.. నేను వెళ్లిపోతే ఫరక్ పడదని అన్నావ్.. నీతో మాట్లాడినా ప్రాబ్లమే.. మాట్లాడకపోయినా పర్లేదు.. అందరికీ ఒక్క మాస్క్ ఉంటే.. నీకు ఐదారు మాస్క్‌లు ఉన్నాయి అంటూ క్రీమ్ తీసుకుని వెళ్లి దట్టంగా పూశాడు.ఇది చూసి అందరూ షాకయ్యారు. నామినేషన్ ప్రక్రియ చాలా వాడివేడిగానే జరగగా, మొత్తం నామినేషన్‌లో 10 మంది ఉన్నారు. మానస్, సన్నీ, శ్రీరామ్, సిరి, కాజల్, ప్రియాంక, రవి, జెస్సీ, అనీ మాస్టర్, విశ్వ ఈ పది మంది నామినేట్ అయ్యారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…