గురువారం, జూన్ 11, 2026
వార్తలు

Bigg Boss 5 : బిగ్ బాస్ రీఎంట్రీ కోసం పోల్.. ఎవ‌రిని తిరిగి తీసుకురానున్నారో తెలుసా?

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం సీజ‌న్ 5 కొనసాగుతోంది. 19 మంది స‌భ్యులతో షో మొద‌లు కాగా, ప్రతివారం ఒకరు చొప్పున ఇప్పటికే ఆరుగురు హౌస్…

Bigg Boss 5 : బిగ్ బాస్ రీఎంట్రీ కోసం పోల్.. ఎవ‌రిని తిరిగి తీసుకురానున్నారో తెలుసా?

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం సీజ‌న్ 5 కొనసాగుతోంది. 19 మంది స‌భ్యులతో షో మొద‌లు కాగా, ప్రతివారం ఒకరు చొప్పున ఇప్పటికే ఆరుగురు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో వాళ్ల నుంచి ఇప్పుడు ఒకరిని షోలోకి తీసుకు వస్తున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ రీఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్ ఎవరు ? అన్న దానిపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.

Bigg Boss 5 re entry poll who will return

తాజా సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రతి వారం నామినేషన్స్‌లో ఎక్కువ మంది ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొదటి వారం సరయు రాయ్, రెండో వారంలో సీనియర్ నటి ఉమాదేవి, మూడో వారంలో లహరి షారి, నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారంలో శ్వేతా వర్మ‌లు ఎలిమినేట్ అయిపోయారు. ఈ వారం తొమ్మిది మంది సభ్యులు నామినేట్ కాగా అందులో అనీ మాస్ట‌ర్ లేదా లోబో ఎలిమినేట్ కానున్నాడ‌ని అంటున్నారు.

అయితే హౌజ్‌లో స‌గం మంది అమ్మాయిలు బ‌య‌ట‌కు పోవ‌డంతో గ్లామ‌ర్ డోస్ త‌గ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో త్వరలోనే ఓ ఫీమేల్ కంటెస్టెంట్‌తో రీఎంట్రీ ఇప్పించాలని బిగ్ బాస్ నిర్వహకులు ప్లాన్ చేసినట్లు తాజాగా బుల్లితెర వర్గాల్లో ఓవార్త‌ తెగ వైరల్ అవుతోంది. ఎవరు వస్తే బాగుంటుందని కొందరు పోల్స్ కూడా పెడుతున్నారు. హ‌మీదాని తీసుకొచ్చే ప్ర‌య‌త్న‌మే జ‌రుగుతుంద‌ని చాలా మంది అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి