Bigg Boss 5 : రూ.25 ల‌క్ష‌లు అందుకున్న కంటెస్టెంట్ ఎవరో తెలుసా ?

December 19, 2021 4:31 PM

Bigg Boss 5 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం నేడు ఫినాలే జ‌రుపుకోనుంది. ఈ కార్యక్ర‌మంలో విజేత ఎవ‌రు, ర‌న్న‌రప్‌ ఎవ‌రు.. అనే అంశాల‌పై ఆస‌క్తికర చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ప‌లు వార్త‌ల న‌డుమ తాజాగా ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. అనూహ్యంగా బిగ్ బాస్ నుండి రూ. 25 లక్షలు తీసుకొని శ్రీరామ్ త‌ప్పుకున్నట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

Bigg Boss 5 do you know who took rs 25 lakhs

బిగ్ బాస్ సీజన్ 4 ఫైనల్ కి చేరిన సోహైల్ అందరికీ షాకిస్తూ టైటిల్ రేసు నుండి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ సీజన్ లో అభిజిత్, అఖిల్, సోహైల్, అరియానా, హారిక ఫైనల్ లో పోటీపడ్డారు. హారికకు 5వ స్థానం, అరియానాకు 4వ స్థానం దక్కింది. టైటిల్ కోసం అభిజిత్, అఖిల్, సోహైల్ మధ్య పోటీ నెలకొంది. ఆ సమయంలో నాగార్జున రూ. 25 లక్షలు ఆఫర్ చేశారు. ఈ ఆఫర్ ని సోహైల్ తీసుకున్నాడు.

ఈసారి సింగర్ శ్రీరామ్ ఆ ఆఫర్‌ను తీసుకున్నట్లు వినికిడి. సిరి, మానస్ 4,5 స్థానాలతో ఎలిమినేట్ కాగా.. టైటిల్ కోసం సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ్ పోటీపడ్డారట. ఈ క్రమంలో నాగార్జున టైటిల్ దక్కుతుందని నమ్మకం లేనివారు ఎవరైనా ఒకరు.. రూ. 25 లక్షలు తీసుకొని రేసు నుండి తప్పుకోవాలని సూచించగా.. శ్రీరామ్ డబ్బులు తీసుకొని టైటిల్ రేసు నుండి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో సన్నీ, షణ్ముఖ్ ఫైనల్ కి చేరారు. నేటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి గెస్ట్స్ గా రామ్ చరణ్, అలియా భట్, శ్యామ్ సింగరాయ్ టీమ్ గెస్ట్స్ గా రానున్నట్లు తెలుస్తోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now