Bigg Boss 5 : బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 విజేత‌.. వీజే స‌న్నీ..!

December 19, 2021 9:21 PM

Bigg Boss 5 : గ‌త 3 నెల‌లుగా ఎంతో ఉత్సాహంగా బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 కొన‌సాగింది. ఎట్ట‌కేల‌కు ఈ షోకు ఆదివారంతో తెర‌ప‌డింది. ఈ క్ర‌మంలోనే ఈ సీజ‌న్‌కు విన్న‌ర్‌గా వీజే స‌న్నీ నిలిచాడు. ఖ‌మ్మం జిల్లాకు చెందిన వీజే స‌న్నీ బిగ్‌బాస్ ఇంట్లోకి టీవీ సీరియ‌ల్ ఆర్టిస్ట్‌గా అడుగు పెట్టాడు. ఈ క్ర‌మంలోనే అత‌ను టాప్ 5 ఫైన‌లిస్ట్స్‌లో ఒక‌డిగా నిలిచాడు. త‌రువాత సీజ‌న్ 5 విన్న‌ర్ అయ్యాడు.

Bigg Boss 5 telugu season winner is VJ Sunny

గ్రాండ్ ఫినాలెలో టాప్ 5 లో శ్రీ‌రామ చంద్ర‌, స‌న్నీ, సిరి, ష‌ణ్ముఖ్‌, మాన‌స్ నిలిచారు. ఈ క్ర‌మంలోనే అక్కినేని నాగార్జున ఫినాలె వారంలో మొత్తం 13 కోట్ల ఓట్లు పోలైన‌ట్లు తెలిపారు. కాగా గ‌త 4 సీజ‌న్ల‌లోనూ ఒక్క ఫీమేల్ విన్న‌ర్ కూడా లేక‌పోవ‌డం విశేషం. ఈ 5వ సీజ‌న్‌లోనూ ప్రేక్ష‌కులు మేల్ కంటెస్టెంట్‌నే విన్న‌ర్‌ను చేశారు. వీజే స‌న్నీ ఈ సీజ‌న్‌కు విజేత‌గా నిలిచాడు. ఇక ష‌ణ్ముఖ్ ర‌న్న‌ర‌ప్‌గా నిల‌వ‌గా, శ్రీ‌రామ చంద్ర మూడో స్థానంలో నిలిచాడు.

బిగ్ బాస్ తెలుగు 5వ సీజ‌న్ మొత్తం 19 మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభం అయింది. స‌ర‌యు, ఉమా దేవి, ల‌హ‌రి షెరి, శ్వేతా వ‌ర్మ‌, ప్రియా, ప్రియాంక సింగ్‌, న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌, హ‌మీదా, విశ్వ‌, ర‌వి, లోబో, అనీ మాస్ట‌ర్‌, జెస్సీ, ఆర్‌జే కాజ‌ల్‌, స‌న్నీ, ష‌ణ్ముఖ్‌, సిరి, శ్రీ‌రామ‌చంద్ర‌ల‌తో ఈ సీజ‌న్‌ను ప్రారంభించారు. చివ‌ర‌కు స‌న్నీ ఈ సీజ‌న్‌కు విజేత‌గా నిలిచాడు.

ఇక బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5 గ్రాండ్ ఫినాలెకు ప‌లువురు సెల‌బ్రిటీలు అతిథులుగా వ‌చ్చారు. ద‌ర్శ‌కులు ఎస్ఎస్ రాజ‌మౌళి, సుకుమార్‌, హీరోలు నాగ‌చైత‌న్య‌, నాని, హీరోయిన్లు కృతి శెట్టి, ఆలియా భ‌ట్‌ల‌తోపాటు ర‌ణ‌బీర్ క‌పూర్‌, సాయి ప‌ల్ల‌వి, రష్మిక మంద‌న్న‌, శ్రియ‌లు ఈ గ్రాండ్ ఈవెంట్‌కు హాజ‌రై ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now