Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 లీక్.. ఓటింగ్ ప్ర‌కారం విజేత అత‌డే..!

December 19, 2021 11:13 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం నేటితో ముగియ‌నుంది. మ‌రి కొద్ది గంట‌ల్లో విజేత ఎవ‌ర‌నేది తెలియ‌నుంది. ఎవ‌రు ట్రోఫీని అందుకుంటారు, ఎవ‌రు ర‌న్న‌ర్‌గా నిల‌వ‌నున్నారు అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే అనధికారిక ఓటింగ్‌లోనూ మానస్‌, సిరి చివరి రెండు స్థానాల్లో ఉన్నారు. ఐదో స్థానంలో ఉన్నప్పుడు సిరి, నాలుగో స్థానంలో ఉన్నప్పుడు మానస్‌ ఎలిమినేట్‌ అవుతారని అందరూ అంచనా వేశారు. ఇప్పుడదే నిజమైనట్లు కనిపిస్తోంది.

Bigg Boss 5 season leak he is the winner according to votes

టాప్‌ 3లో ఉన్న షణ్ను, సన్నీ, శ్రీరామ్‌లలో ఎవరో ఒకరు ట్రోఫీని తీసుకునే అవకాశం ఉంది. నాగార్జున ఇచ్చిన ఆఫ‌ర్ ను శ్రీరామ్ అందిపుచ్చుకున్న‌ట్టు స‌మాచారం. ఇక విజేత ఎవ‌రు అనే దానిపై ఓటింగ్ లెక్క‌లు ప‌రిశీలించ‌గా, బిగ్ బాస్ సీజన్ 5 కి విజేత సన్నీ అని తెలుస్తోంది. బిగ్ బాస్ నుంచి ఎన్నో లీక్ లు వచ్చాయి. అందులో 90 శాతంకు పైగా నిజం అయ్యాయి. కనుక ఈ లీక్ నిజం అయ్యి ఉండవచ్చు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ లో సన్నీకి అత్యధికంగా ఓట్లు నమోదు అయ్యాయి. ముందు నుండి అనుకుంటున్నట్లుగా సన్నీ, షన్నూల మద్య పోటీ తీవ్రంగా నెలకొంది. సన్నీకి 34 శాతం ఓట్లు రాగా షన్నూ కు 31 శాతం ఓట్లు నమోదు అయ్యాయట. సిరి వ‌ల‌న ఎక్కువ‌గా నెగెటివిటీ అందుకున్న ష‌ణ్ముఖ్ ర‌న్న‌ర్‌గా నిలిచిన‌ట్టు స‌మాచారం. అమ్మాయిల నుండి ఆంటీల వరకు సన్నీని నెత్తిన ఎత్తుకుని మరీ విజయాన్ని కట్టబెట్టారనేది విశ్లేషకుల వాదన. మరి విన్నర్‌ ఎవరు అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now