Bigg Boss 5 : సిరి – ష‌ణ్ముఖ్ మ‌ధ్య ఏం జ‌రుగుతుంది..? బండారం బ‌య‌ట‌పెట్టిన ర‌వి..!

November 29, 2021 2:17 PM

Bigg Boss 5 : ఊహించ‌ని ట్విస్ట్‌తో బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన యాంక‌ర్ ర‌వి .. అరియానాకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలియ‌జేశాడు. అరియానా అడిగిన ప్రశ్నలకు సూటిగా సుత్తిలేకుండా అసలు విషయాలను బయటపెట్టాడు. ఎలిమినేట్ అవుతారని ఊహించారా ? అని అరియానా అడగ్గా.. ‘అస్సలు ఊహించలేదు.. నాకిది చాలా పెద్ద షాకింగ్’ అని అన్నాడు రవి.

Bigg Boss 5 : సిరి - ష‌ణ్ముఖ్ మ‌ధ్య ఏం జ‌రుగుతుంది..? బండారం బ‌య‌ట‌పెట్టిన ర‌వి..!

గుంట న‌క్క అనే కామెంట్స్‌పై ఏమైనా బాధ‌ప‌డ్డారా.. అని అరియానా ప్ర‌శ్నించ‌గా, అందుకు స్పందించిన ర‌వి.. ఎప్పుడూ అస‌లు అలా ఆలోచించ‌లేదు. అది నన్ను ప్రభావితం చేయలేదు. నటరాజ్ మాస్టర్ హౌస్‌లోకి వచ్చేప్పుడే మైండ్‌లో ఏదో పెట్టుకుని వచ్చాడు. ఇక షణ్ముఖ్ గేమ్ ఎక్కడ ఆడుతున్నాడో తెలియలేదు.. నాకైతే కనిపించలేదు. ప్రియాంక బిగ్ బాస్ ఆడటానికి వచ్చిందా ? మానస్ కోసం వచ్చిందా ? అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇచ్చాడు ర‌వి.

ప్రియాంక ఎందుకు వచ్చిందో నాకే తెలియడం లేదు.. ఎందుకొచ్చిందో తెలుసుకునే లోపే ఆమె టైం అయిపోతుంది. పింకీ మానస్‌పై చూపించే శ్రద్ధలో సగం కూడా మానస్ ఆమెపై చూపించడు. కాజ‌ల్ గురించి చెబుతూ.. కాజల్ తన రూల్స్‌తో తను ఆడింది.. నేను నా రూల్స్‌తో ఆడాను. కాజల్ గేమ్ ఛేంజర్ కాదు.. గేమ్ డిస్టర్బర్‌ అని అన్నాడు.

సిరి-షణ్ముఖ్‌ల మధ్య రిలేషన్ గురించి మాట్లాడుతూ.. షణ్ముఖ్ దీప్తిని ఎంత లవ్ చేస్తాడో.. సిరి చోటూని ఎంత లవ్ చేస్తుందో ఈ ఇద్దరికీ తెలుసు.. సిరి ఆల్‌రెడీ ఓ సారి ఓపెన్ అయింది. ఐ లైక్‌ హిమ్ అని నాతో చెప్పింది అంటూ సిరి-షణ్ముఖ్‌ల బండారం బ‌ట్ట బ‌య‌లు చేశాడు ర‌వి.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment