Bigg Boss 5 : సన్నీని కొట్టబోయిన ప్రియా.. ప్రియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సన్నీ..!

October 20, 2021 3:27 PM

Bigg Boss 5 : బిగ్ బాస్ హౌస్ లో రోజు రోజుకూ కంటెస్టెంట్ ల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ బంగారు కోడిపెట్ట టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా ప్రభావతి అనే కోడి కూత పెట్టి గుడ్లు పెడుతుంది. కొన్నిసార్లు గుడ్ల వర్షం కూడా కురుస్తుంది. అయితే ఎవరైతే ఎక్కువ గుడ్లను సంపాదించి ఆ గుడ్లకు వారి ఫేస్ స్టిక్కర్ అతికించాలి. ఎవరైతే ఎక్కువ గుడ్లు సంపాదిస్తారో వారు కెప్టెన్సీ టాస్క్ లో గెలుపొందినట్లనే బిగ్ బాస్ సూచిస్తారు.

Bigg Boss 5 priya goes to hit sunny he is given warning to her

అయితే ఈ టాస్క్ మొదలవకముందే ప్రియా తాను ఇతరుల గుడ్లు దొంగతనం చేస్తానని చెప్పింది. ఇలా గుడ్లను తీసుకుంటున్న క్రమంలో ప్రియా సన్నీ గుడ్లను దొంగతనం చేస్తోంది. తాను ముందుగా చెప్పినట్లే సన్నీ గుడ్లను దొంగతనం చేయడంతో సన్నీ పడిన కష్టమంతా వృథాగా మారిందని బాధపడతాడు.

ఇలా వీరిద్దరి మధ్య గుడ్ల దొంగతనం విషయంలో పరస్పరం మాటలు చోటు చేసుకొని చివరికి కొట్టుకునే వరకు వెళ్లారు. చేతకాని వాళ్లు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడుతారని సన్నీ అనగా ప్రియా కూడా అందుకు దీటుగా కౌంటర్ ఇవ్వడమే కాకుండా సన్నీపై ప్రియా చేయి చేసుకోబోయింది. ప్రియా చేయి చేసుకోవడానికి రావడంతో సన్నీ కూడా తనకు వేలు చూపిస్తూ చెంప పగులుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి నేటి ఎపిసోడ్ లో వీరి గొడవ ఏ స్థాయికి చేరుకుంటుందో తెలియాల్సి ఉంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment