Bigg Boss 5 : శ్రీరామ్ పై ముద్దుల వర్షం కురిపించిన ప్రియాంక.. మధ్యలో అనీ మాస్టర్ జోక్యం చేసుకోవడంతో..?

October 26, 2021 11:02 AM

Bigg Boss 5 : బిగ్ బాస్ కార్యక్రమం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ లకు హౌస్ నుంచి లెటర్స్ వస్తాయి. అయితే ఇందులో ఒకరు మాత్రమే ఆ లేఖను పొందే అవకాశం ఉంటుంది. మరొకరు వారి ఇంటి నుంచి వచ్చిన లేఖను వదులుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రియాంక, విశ్వ, అనీ మాస్టర్, శ్రీరామ్ లేఖను పొందే అవకాశాన్ని దక్కించుకున్నారు.

Bigg Boss 5  ani master interrupted sriram and pinky

ఈ క్రమంలోనే సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళిన లోబో, విశ్వకి రవి, శ్రీరామ్ లేఖలు అందాయి. రవి కోసం శ్రీరామ్ లేఖ వదులుకోవాలని భావించాడు. అయితే లోబో చెప్పిన మాటలు విని రవి తన లేఖను వదులుకొని శ్రీరామ్ లేఖను చదివి వినిపించాడు. ఇలా రవి శ్రీరామ్ లేఖను చదవగా అది విన్న శ్రీరామ్ ఎంతో ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఒక్కసారిగా శ్రీరామ్ భావోద్వేగం కావడంతో అది చూసిన ప్రియాంక అతడి దగ్గరకు వెళ్లి కన్నీటిని తుడిచి అతనిపై ముద్దుల వర్షం కురిపించింది. ఇక ఈ సన్నివేశం చూసిన అనీ మాస్టర్ కల్పించుకొని ఇదే వంకతో ముద్దులు కూడా పెట్టేసుకుంటున్నారా.. అంటూ వారిపై సెటైర్లు వేసింది. ఇలా అని మాస్టర్ కల్పించుకోవడంతో ఒక్క సారిగా అందరూ నవ్వుకున్నారు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment