Bigg Boss 5 : ర‌వి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్న ట్రోల‌ర్స్.. బాధ‌ వ్య‌క్తం చేసిన యాంక‌ర్ భార్య‌..

November 23, 2021 9:14 AM

Bigg Boss 5 : బుల్లితెర మేల్ యాంక‌ర్స్ లో ర‌వికి ఉన్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఎంట‌ర్‌టైన్ చేసే ర‌వి ఈ సారి సీజ‌న్ 5లోకి అడ‌గుపెట్టాడు. అయితే ఈ షోతో ర‌వి నెగెటివిటీని చాలా మూట‌గ‌ట్టుకున్నాడు. నాగార్జుతోపాటు తోటి కంటెస్టెంట్స్ కూడా ర‌విని ప‌లు సంద‌ర్భాల‌లో అన‌రాని మాట‌లు అన్నారు. న‌ట‌రాజ్ మాస్ట‌ర్ అయితే అత‌నికి గుంట న‌క్క అని పేరు కూడా పెట్టారు.

Bigg Boss 5 anchor ravi trolled by netizen

బిగ్ బాస్ 5 సీజ‌న్‌లో ర‌వి స్ట్రాంగ్ క్యాండిడేట్ కాగా, టైటిల్ విన్న‌ర్‌ల‌లో ఒక‌డిగా నిలిచే స‌త్తా అత‌నికి ఉంది. ప్ర‌తీసారీ.. ఎలిమినేష‌న్ల‌లో ఉండ‌డం, ఓటింగ్ వ‌ల్ల‌.. గ‌ట్టెక్క‌డం ర‌వికి అల‌వాటుగా మారాయి. ర‌వి ఫాలోవ‌ర్లు, ర‌విని అభిమానించేవాళ్లు ర‌వికి అండ‌గా ఉంటున్నారు. అయితే.. కొంత‌మంది ర‌విని అకార‌ణంగా కార్న‌ర్ చేయ‌డం మొద‌లెట్టారు. సోష‌ల్ మీడియాలో కొంత‌మంది ఫేక్ ఎకౌంట్లు సృష్టించి, ర‌విని, వాళ్ల కుటుంబ స‌భ్యుల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

యాంకర్‌ రవిని అకార‌ణంగా ట్రోల్‌ చేయ‌డం మొద‌లెట్టారు. సోష‌ల్ మీడియాలో కొంత‌మంది ఫేక్ అకౌంట్లు సృష్టించి, ర‌విని, వాళ్ల కుటుంబ స‌భ్యుల్ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారని రవి సన్నిహితులు చెబుతున్నారు. ‘కావాలనే కొంతమంది నా పేరును, నా కూతురిని ఈ ట్రోల్స్‌లోకి తీసుకొస్తున్నారు’ అని రవి భార్య నిత్య ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇది గేమ్‌ స్పిరిట్‌ కాదని, తమను ఎందుకు ట్రోల్‌ చేస్తున్నారో అర్థం కావట్లేదని సన్నిహితుల దగ్గర వాపోయింది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment