Bhimla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం “భీమ్లా నాయక్”. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం మలయాళ చిత్రం “అయ్యప్పనుమ్ కోషియుమ్”కి రీమేక్ గా రూపొందుతుండగా, ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ నిత్యా మీనన్‌తో, రానా సంయుక్తా మీనన్‌తో రొమాన్స్ చేస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.
భీమ్లా నాయక్ మూల కథ మలయాళ సినిమాదే అయినా.. త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ ఇమేజ్‌కు తగ్గట్టు తెలుగు నేటివిటీ ప్రకారం కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చారు. సెట్స్‌లోకి వెళ్లక ముందు ఈ సినిమాకు త్రివిక్రమ్ ముందుగా అనుకున్న టైటిల్ ‘అసుర సంధ్య వేళలో..’ సాధారణంగా త్రివిక్రమ్ తన సినిమాలకు ‘అ’ అనే అక్షరంతో టైటిల్స్ పెడుతుంటారు. అదే సెంటిమెంటుతో ‘అసుర సంధ్యవేళలో..’ అనే టైటిల్‌ను అనుకున్నారు.
పవన్‌కళ్యాణ్‌కు ఉన్న మాస్ ఇమేజ్ దృష్ట్యా ఆ టైటిల్ ఆడియెన్స్‌కు అంతగా కనెక్ట్ కాదేమోనని నిర్మాతలు భావించటంతో చివరకు ఆ టైటిల్‌ను ‘భీమ్లా నాయక్’గా ఖరారు చేశారు. పవర్ ఫుల్ టైటిల్‌తో ఈ సినిమాకి మంచి క్రేజ్ దక్కిందనే చెప్పాలి. ఈ చిత్రం తర్వాత క్రిష్ దర్శకత్వంలో రూపొందుతోన్న హరిహర వీరమల్లు సినిమాను పవన్ పూర్తి చేయడానికి రెడీ అవుతున్నారు. ఇంకా హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో చిత్రాన్ని పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…