Bangaram Girl : సోషల్ మీడియాలో ప్రస్తుతం చాలా మంది ఫేమస్ అవుతున్నారు. అలాగే బంగారం.. అనే డైలాగ్‌తో ఆ అమ్మాయి ఫేమస్ అయింది. దీంతో ఆమె సోషల్ మీడియాలో అందరికీ బాగా పరిచయం అయింది. అయితే ఇంతకీ అసలు ఆమె ఎవరు.. ఆమె వివరాలు ఏమిటి.. అనే విషయాలను తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా ఆమె ఓ యూట్యూబ్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడంతో అసలు ఆమె ఎవరు.. అన్న విషయం తెలిసిపోయింది. ఈ క్రమంలోనే ఆమె వీడియో వైరల్ అవుతోంది.
ఆ వీడియో చేసిన అమ్మాయి పేరు శాంతి. మతిస్థిమితం లేని శాంతి తండ్రి చిన్నప్పుడే ఇంటి నుండి పారిపోయాడు. కన్న తండ్రి కోసం కొన్నాళ్ళు ఊళ్లు, వీధులు పట్టుకొని తిరిగారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. శాంతికి తల్లితోపాటు ఓ తమ్ముడు ఉన్నాడు. 10వ తరగతి వరకు చదువుకుంది. కుటుంబ పోషణ కోసం కూలి పనులకు వెళుతూ ఉంటుంది. అనేక సందర్భాల్లో తన తల్లి దూషణకు గురైంది. కొందరు తన తల్లిని కొట్టారని చెబుతూ శాంతి ఆవేదన చెందింది.
సోషల్ మీడియాలో వీడియోలు చేయడం అలవాటు చేసుకున్న శాంతి కొత్తగా ఏదైనా చేయాలి అనుకుంది. ఓ రోజు బంగారం నీ గురించి అందరూ అడుగుతున్నారు.. అంటూ తన లవర్ తో మాట్లాడుతున్నట్లు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. క్యూట్ నెస్, ఇన్నోసెన్స్ కలగలిపి ముచ్చటగొలిపేలా ఉన్న ఆ వీడియో వైరల్ గా మారింది. దాంతో ఓవర్ నైట్ శాంతి ఫేమ్ తెచ్చుకుంది. ఆమె డైలాగ్ లను చెబుతూ వేలల్లో సోషల్ మీడియా వీడియోలు పుట్టుకొచ్చాయి. డీజే సాంగ్స్ చేశారు.
అయితే ప్రస్తుతం శాంతికి జబర్దస్త్ నుంచి ఆఫర్ వచ్చినట్లు సమాచారం. దీంతో ఆమె త్వరలోనే జబర్దస్త్ స్కిట్స్‌లో కనిపించనుందని అంటున్నారు. ఆమె జబర్దస్త్ స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలు బయటికి వచ్చాయి. జబర్దస్త్ కమెడియన్స్ తో శాంతి కనిపించింది. దీంతో ఆమె త్వరలోనే జబర్దస్త్ వేదికపై కనిపిస్తుందని అంటున్నారు. అయితే ఆమె షోలో ఎప్పుడు కనిపిస్తుందో చూడాలి. దీంతో ఆమె జీవితమే మారిపోనుంది.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…