Bandla Ganesh : బండ్ల గణేష్ నటుడిగానే కాదు సేవాతత్వం ఉన్న మనిషిగానూ అందరి మనసులను గెలుచుకుంటూ ఉంటారు. గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన బండ్ల తాజాగా ఓ నేపాలీ అమ్మాయిని దత్తత తీసుకొని ఆశ్చర్యపరిచారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు బండ్ల గణేష్.
బండ్ల గణేష్ కి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉందన్న సంగతి తెలిసిందే. తన కొడుకులిద్దరినీ సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పరిచయం చేశారు. ఇక తన కూతురిని ఏకంగా ఓంకార్ షోకి తీసుకొచ్చారు.
తాజాగా చిన్నారిని పరిచయం చేస్తూ.. నేపాలీ పాపను తాను పెంచుకుంటున్నట్టు తెలిపాడు. పాపను ఏడుస్తుంటే.. వాళ్ల అమ్మ తమ దగ్గర ఏమీ లేక పొద్దున, రాత్రి కేవలం పాలు మాత్రమే పట్టేదట. నా భార్య అలా చూసి.. మనం పెంచుకుందామని చెప్పింది. అలా ఇప్పుడు ఈ పాప మా ఇంట్లో ఓ మెంబర్ అయిపోయింది.. అందరూ కుక్కలు, పిల్లులు అని పెంచుకుంటారు. వాటి కోసం ఎంతో ఖర్చు పెడుతుంటారు.
నేను పాపను పెంచుకుందామని డిసైడ్ అయ్యా. ఆ పాప బాధ్యత తనది అని, మంచిగా పెంచాలి.. గొప్పగా చదివించాలని బండ్లన్న తెలిపాడు. ఇప్పుడు ఆ పాపే అందరినీ బెదిరించే స్థాయికి వచ్చిందని బండ్లన్న సరదాగా వ్యాఖ్యలు చేశాడు. మొత్తానికి ఓ పాపకు మాత్రం బండ్లన్న జీవితాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టే బండ్లన్న ఎంత మంచి వాడనేది అర్ధమవుతుందని.. కామెంట్స్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అంటే కేవలం భారీ సినిమాలకే కాదు, ఆయన ఉదార స్వభావానికి కూడా ప్రత్యేక గుర్తింపు…
భద్రతా కారణాలతో భారత్‌లో జరిగే 2026 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) స్పష్టం చేయడంతో, అంతర్జాతీయ…
బీహార్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (BSSC) నిర్వహిస్తున్న భారీ ఇంటర్ లెవల్ నియామక ప్రక్రియకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును…
రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని…
భారతీయ వంటింట్లో పప్పులను చాలామంది సూపర్ ఫుడ్ గా భావిస్తారు. ఇవి శరీరానికి అవసరమైన మొక్కల ఆధారిత ప్రోటీన్‌ను సమృద్ధిగా…
ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే అతని పరిస్థితిని కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. దాన్ని ఆసరాగా చేసుకుని తమ స్వప్రయోజనాలు…
ఈ రోజుల్లో పాన్ కార్డు ప్రతి భారతీయ పౌరునికి అత్యంత ముఖ్యమైన పత్రంగా మారింది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు…
మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి విడుదల తర్వాత బాక్సాఫీస్ వద్ద…