Balakrishna : ఆహా కోసం బాలయ్య రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

October 16, 2021 7:03 PM

Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ మొట్టమొదటిసారిగా తొలి తెలుగు ఓటీటీ ఆహా టాక్ షో తో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. మొట్టమొదటిసారిగా ఆహా యాప్ ద్వారా అన్ స్టాపబుల్ అనే టాక్ షో నిర్వహించనున్నారు. తాజాగా ఈ షో లాంచ్ వేడుకను ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

Balakrishna remuneration for aha unstoppable talk show

పన్నెండు వారాల పాటు సాగే ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించి వారి వ్యక్తిగత విషయాల గురించి చర్చించనున్నారు. ఈ క్రమంలోనే మొట్టమొదటిసారి ఈ కార్యక్రమానికి ఎవరు రానున్నారు అనే విషయంపై ఎంతో ఆతృత నెలకొంది. నవంబర్ 4 నుంచి ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇకపోతే ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణ రెమ్యునరేషన్ గురించి ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలకృష్ణకు ఒక ఎపిసోడ్ కి ఏకంగా రూ.40 లక్షల రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ క్రమంగా చూసుకుంటే ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సుమారుగా రూ.5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనే వార్త వినబడుతోంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment