Chiranjeevi : మెగా హీరోలను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్.. అది రిపీట్ అయితే గాడ్ ఫాదర్ ప‌ని అయిపోయిన‌ట్లే..

Chiranjeevi : టాలీవుడ్ కి మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికీ చిరు హిట్లతో ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. అయితే ఇటీవల విడుదలైన మెగాస్టార్ ఆచార్య మూవీ డిజాస్టర్ అయ్యింది. అయితే దీని వెనుక ఓ బ్యాడ్ సెంటిమెంట్ కూడా ఉంది. ఆ అక్షరంతో మొదలయ్యే టైటిల్ చిరంజీవికి కలిసి రాలేదు అంటున్నారు కొందరు. ఆరాధన, ఆపద్బాంధవుడు ఫెయిల్యూర్స్ దానికి ఉదాహరణగా చెబుతున్నారు. ఈ క్రమంలో గాడ్ ఫాదర్ చిత్రానికి కూడా ఇలాంటి బ్యాడ్ సెంటిమెంట్ ఒకటి ఉందంట‌. మెగా హీరోలకు ముఖ్యంగా.. రామ్ చరణ్, చిరంజీవికి ఇంగ్లీష్ టైటిల్స్ కలిసి రావడం లేదు అంటున్నారు.

చిరంజీవికి కలిసిరాని ఇంగ్లీష్ టైటిల్ సెంటిమెంట్ రామ్ చరణ్ ని కూడా వెంటాడింది. చరణ్ ఇప్పటి వరకు 2 చిత్రాల‌ను ఇంగ్లీష్ టైటిల్స్ తో చేశాడు. అవి రెండూ డిజాస్టర్ అయ్యాయి. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత విడుదలైన ఆరంజ్, బ్రూస్లీ చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇక చిరంజీవి కెరీర్‌లో ఇంగ్లీష్ టైటిల్ తో 10 చిత్రాల వరకు వచ్చాయి. చిరంజీవి ఇంగ్లీష్ టైటిల్ తో చేసిన మొదటి చిత్రం ఐ లవ్ యు. అప్పటికి చిరంజీవికి నటుడిగా గుర్తింపు రాలేదు. ఆ సినిమా సరిగా ఆడలేదు. తర్వాత స్టేట్ రౌడీ, బిగ్ బాస్, మాస్టర్, డాడీ, స్టాలిన్ ఇలా ఇంగ్లీష్ టైటిల్ తో చేసిన చిత్రాలు డిజాస్టర్ లేదా యావరేజ్ రిజల్ట్ అందుకున్నాయి. ఆయన లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్ ఇంగ్లీష్ టైటిల్ కాగా ఈ బ్యాడ్ సెంటిమెంట్ మేకర్స్ ని భయపెడుతుంది. యాంటీ ఫ్యాన్స్ ఈ విషయాన్ని హైలైట్ చేస్తున్నారు. కొందరు మాత్రం అవన్నీ మూఢనమ్మకాలని కొట్టిపారేస్తున్నారు.

Chiranjeevi

ఆ మాటకొస్తే చిరంజీవి ఇంగ్లీష్ టైటిల్స్ తో బ్లాక్ బస్టర్స్ కొట్టారని గుర్తు చేస్తున్నారు. ఛాలెంజ్, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి చిత్రాలు ఇంగ్లీష్ టైటిల్ తో విడుదలై భారీ విజయాలను అందుకున్నాయి. కాబట్టి ఇవన్నీ అర్థం లేని ఆలోచనలని కొట్టిపారేస్తున్నారు. ఇదిలా వుండగా గాడ్ ఫాదర్ మూవీపై పరిశ్రమలో కనీస బజ్ లేదు. అలాగే మూవీపై అనేక నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా అవుట్ ఫుట్ పట్ల సంతృప్తి చెందని సల్మాన్ హిందీ వెర్షన్ విడుదల వద్దంటున్నారట. ఆయన ఈ మూవీని ప్రమోట్ చేయడానికి ఆసక్తి చూపడం లేదట. అలాగే గాడ్ ఫాదర్ చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు ముందుకు రావడం లేదంటూ అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. మరో రెండు వారాలు ఆగితే టైటిల్ సెంటిమెంట్ ఎంతవరకు నిజమో తెలుస్తుంది.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM