Asin : రూ.10 కోట్లకు తన కెరియర్ ను రిస్క్ లో పెట్టిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

October 27, 2021 2:00 PM

Asin : చూడగానే అందరినీ ఆకట్టుకునే అందం తనది, కేవలం తన అందంతో మాత్రమే కాకుండా అద్భుతమైన నటన, డాన్స్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న తార ఆసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ హీరో సూర్య, ఆసిన్ జంటగా తెరకెక్కిన గజిని సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. గజిని సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆసిన్ ఆ తర్వాత అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఘర్షణ, శివమణి వంటి చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.

Asin spoiled her career for rs 10 crores

ఇలా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకున్న సమయంలో ఆసిన్ ఉన్న ఫలంగా వెండితెరకు దూరమైంది. అయితే ఈమె ఒక ప్రైవేట్ కంపెనీతో రూ.10 కోట్లకు ఒక సంవత్సరం పాటు డీల్ కుదుర్చుకుని అక్కడ సంవత్సరం పాటు ఉండటం వల్ల ఈమెకు పూర్తిగా సినిమా అవకాశాలు దూరమయ్యాయి.

ఇలా పది కోట్ల రూపాయలకు ఎంతో అద్భుతమైన తన కెరియర్ ను నాశనం చేసుకుంది. ఇక ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోవడంతో ఆసిన్ మైక్రోమ్యాక్స్ సంస్థకు కో ఓనర్ గా పని చేస్తున్న రాహుల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడింది. ప్రస్తుతం వీరికి ఒక పాప కూడా ఉంది. ఈ క్రమంలోనే ఆసిన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుందని వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంపై ఆసిన్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment