Ashu Reddy : డబ్ స్మాష్ వీడియోలతో బాగా పాపులారిటీ దక్కించుకున్న అషూ రెడ్డి బిగ్ బాస్ షోలో పాల్గొని ఆ పాపులారిటీని మరింత రెట్టింపు చేసుకుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఈ అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ వీడియో షేర్ చేస్తూ పెద్ద షాక్ ఇచ్చింది. అషూ రెడ్డికి స్వతహాగా హ్యాండ్ బ్యాగులంటే చాలా ఇష్టం. ఆ మధ్య అషూ తల్లి హ్యాండ్ బ్యాగును నేల మీదకు విసిరి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను అషూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అయింది.
ఇక రీసెంట్‌గా దుబాయ్ చుట్టేసి వచ్చిన అషూ రెడ్డి పోయేటప్పుడు ఒక సూట్‌కేసుతో వెళ్లి వచ్చేటప్పుడు నాలుగైదు సూటుకేసులతో వచ్చింది. అందులో మామూలు హ్యాండ్ బ్యాగులు లేవు. ఒక్కో దాని ధర రూ.2 లక్షలు, రెండున్నర లక్షలున్నాయి. వాటి రేట్లను చూసి అషూ రెడ్డి అమ్మ నోరెళ్లబెట్టేసింది. డబ్బుల విలువ తెలియడం లేదంటూ చీవాట్లు పెట్టేసింది. నీకు ఇలా చెబితే అర్థం కాదే.. అంటూ అషూకి షాకిచ్చింది.
ఇంట్లో ఉన్న పాత బ్యాగును ఒకటి తీసుకుని దానికి నిప్పు పెట్టింది. దీంతో అషూ .. ‘ఏంటి మమ్మీ? నీకేమైనా పిచ్చా..’ అంటూ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించింది. ఇలా పాత బ్యాగులు కాలిస్తేనే ఇంకోసారి కొత్త బ్యాగుల జోలికి పోకుండా ఉన్నవాటినే వాడతావని వార్నింగ్ ఇచ్చింది తల్లి.
కొద్ది సేపటికే దుబాయ్ నుండి తెచ్చిన కొత్త బ్యాగ్‌కి పూజలు చేసింది. ఇలా ఎందుకు చేస్తున్నారు ఆంటీ అని అషూ ఫ్రెండ్ అడగగా.. ‘బంగారం కొనమంటే బ్యాగులు కొంటోంది. ఆ బంగారం డబ్బుతోనే బ్యాగులు కొంటుంది, కాబట్టి దీన్ని కూడా బంగారంగా భావించి దండం పెడుతున్నా’ అని చెప్పుకొచ్చింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…