Bigg Boss 5 : బిగ్ బాస్ ప్రతి సీజన్‌లో ఓ రొమాంటిక్ జంట తప్పక ఉంటుంది. వారు చేసే సందడి కొన్ని సార్లు ప్రేక్షకులకి వినోదం కలిగించినా మరి కొన్ని సార్లు విరక్తి తెప్పిస్తుంటుంది. తాజా సీజన్‌లో షణ్ముఖ్, సిరిలు ఫ్రెండ్స్ అంటూనే హగ్గులు, ముద్దులతో నానా రచ్చ చేస్తున్నారు. గురువారం జరిగిన ఎపిసోడ్‌లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్‌లో రవికి సూపర్ పవర్ తీసుకునే ఛాన్స్ రాగా అతడు మాత్రం ఈ అవకాశాన్ని సన్నీకి ఇస్తానన్నాడు.
సన్నీ మాత్రం తనకు ఏ పవర్ వద్దని మొండికేశాడు. బిగ్ బాస్ ఆదేశాలతో చివరకి ఆ పవర్ దక్కించుకున్నాడు. సన్నీ ఏదో ఫ్రస్టేషన్‌లో ఉన్నాడని అర్థమైన కాజల్ అతడి వెంటే నడిచింది. నా తోకలాగా వెనకే వస్తున్నావేంటి ? అని చిరాకుపడ్డాడు సన్నీ. దీంతో హర్ట్ అయిన కాజల్‌ని సన్నీ ఓదార్చాడు. అనంతరం రవి ఇచ్చిన పవర్‌ని ఉపయోగించి సన్నీ గేమ్ ఆడాడు. ఈ గేమ్ ముగిసే సరికి మానస్, ప్రియాంక, సిరి, యానీ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు.
ఇక షణ్ముఖ్.. దీప్తి సునయనను గుర్తు చేసుకుంటుండగా, సిరి.. శ్రీహాన్‌ని తలచుకుంది. అయితే ఓ టాస్క్ జరుగుతున్న సమయంలో సిరి-షణ్ముఖ్ మధ్య గొడవ జరిగింది. దీంతో ఆమె ఐ హేట్ యూ అంటూ లిప్‌స్టిక్‌తో పేపర్ మీద రాసిచ్చింది. ఫీలైన షణ్ను సారీ చెప్పి హగ్గిచ్చాడు. దీంతో సిరి కూడా అతడికి హగ్గిస్తూనే ఏడ్చుకుంటూ వెళ్లిపోయింది. ఇక పింకీని మానస్ పెద్దగా పట్టించుకోకపోవడంతో నన్ను కనీసం మనిషిలా అయినా చూడమని వేడుకుంది. ఈ వారం ప్రెస్టీజ్ రూ.25 వేల గిఫ్ట్ వోచర్ యానీ సొంతమవగా ఆమె ఆనందంతో స్టెప్పులేసింది.
చివరిగా బిగ్ బాస్ ఇంటి సభ్యులతో కొన్ని క్షణాలు ఇంటికి అంకితం అనే సరదా టాస్క్ ఆడించాడు. ఇందులో జంటలుగా విడిపోయిన హౌస్‌మేట్స్ ఓసారి బిగ్‌బాస్ హౌస్‌ను భూతద్దంలో చూసొచ్చి గేమ్ ఆడారు. యానీ మాస్టర్- శ్రీరామ్ జోడీ ఎక్కువ పాయింట్స్ సాధించడంతో చెరో రూ.5000ల గిఫ్ట్ వోచర్ ను గెలుపొందారు.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…