Virat Kohli : బాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ జంట ఒకటి. 2017లో వివాహ బంధంతో ఒక్కటైన విరుష్క జంట డిసెంబరు 11న ఇటలీ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. ఈ అందమైన జంటకు 2021, జనవరి 11న కూతురు వామికా జన్మించింది. ప్రస్తుతం అనుష్క.. కూతురు బాగోగులు చూసుకుంటూ జీవితం గడుపుతోంది.
ఇక నవంబర్ 5న ఇండియన్ క్రికెట్ స్టార్ విరాట్‌కోహ్లీ తన 33వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఆయనకు దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. తన భార్య అనుష్క శర్మ పోస్ట్ చేసిన పోస్ట్ మాత్రం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తనదైన ప్రేమ నిండిన మనసుతో, ఎమోషనల్ కలగలిపి సోషల్ మీడియా వేదికగా అనుష్క తన పోస్ట్‌లో పేర్కొంది.
ఈ ఫొటోకు ఎలాంటి మెరుగులు అక్కర్లేదు. ఉక్కు సంకల్పం.. నిజాయితీతో కూడినది నీ వ్యక్తిత్వం. చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా లెక్క చేయక ముందుకు వెళ్లే ధైర్యం నీ సొంతం. నీలా చీకటి నుంచి అత్యున్నత శిఖరాలకు చేరగల వ్యక్తి మరొకరు ఉండరని నాకు తెలుసు. నీ మనసులో భయానికి తావులేదు. రోజురోజుకీ నువ్వు ఎదుగుతున్న విధానం అమోఘం. సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకునేంత తీరిక లేదని నాకు తెలుసు.
కొన్నిసార్లు నాకు బిగ్గరగా అరిచి చెప్పాలనిపిస్తుంది.. నీ అంతటి అత్యద్భుత వ్యక్తి మరొకరు లేరని ఈ ప్రపంచానికి చాటిచెప్పాలని ఉంటుంది. నువ్వంటే ఏమిటో తెలిసిన వాళ్లకు ఈ మాటలతో పనిలేదు. జీవితంలో ప్రతి విషయాన్ని ప్రకాశవంతంగా.. మరింత అందంగా తీర్చిదిద్దుతున్నందుకు థాంక్యూ. హ్యాపీ బర్త్‌డే క్యూట్‌నెస్’’.. ఒక భార్యకు భర్తపై ఉన్న ప్రేమను తెలియజేసింది. అనుష్క పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో దేశంలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై పడుతున్న ప్రభావంపై బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ స్పందించారు.…
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…