Anu Emmanuel : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ గౌరవం చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా, శిరీష్ ఖాతాలో ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు. 2019లో వచ్చిన ABCD సినిమాతో డిజాస్టర్ అందుకున్న అల్లు శిరీష్ కొన్ని నెలలపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు చాన్నాళ్ల తర్వాత మళ్ళీ ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. విజేత ఫేమ్ రాకేష్ శశి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమా నవంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ తో తాను డేటింగ్ లో ఉన్నాడంటూ వస్తున్న వార్తలపై స్పందించాడు అల్లు శిరీష్. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఊర్వసివో రాక్షసివో సినిమా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ అండ్ శిరీష్ లు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారనే వార్త సోషల్ మీడియా జోరుగా ప్రచారం అయ్యింది.
ఈ మూవీ పోస్టర్ అండ్ టీజర్ లో రొమాన్స్ ఓ రేంజ్ లో ఉండడంతో, టాలీవుడ్ లో మరో కొత్త జంట సెట్ అయ్యిందని సినీ వర్గాల్లో కూడా టాక్ మొదలైంది. దీంతో తాజాగా స్పందించిన శిరీష్ ఆ రూమర్స్ ను కొట్టి పడేశాడు. సినీ తారలపై ఇలాంటి రూమర్స్ క్రియేట్ అవడం సహజమేనని చెప్పిన శిరీష్, గతంలో ఇలాంటి రూమర్స్ తనపై చాలానే వచ్చాయన్నాడు. అను ఇమ్మాన్యుయేల్ కి, తనకు ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదని, ప్రస్తుతం తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని అల్లు శిరీష్ తేల్చి చెప్పాడు. ఈ మూవీలో సునీల్, వెన్నెల కిషోర్, కేదార్ శంకర్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో అయినా శిరీష్ హిట్ కొడతాడో లేదో చూడాలి.
ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్ తిరిగి ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో చేరినప్పటికీ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను కొనసాగించాలని భారత…
క్రికెట్ మ్యాచ్‌లలో తాను ఈగోను ప్రదర్శించనని, దాన్ని హోటల్ గదిలోనే వదిలి వస్తానని, జట్టు తనను ఎలా ఉపయోగించుకోవాలనుకుంటుందో అలా…
రాజమౌళి దర్వకత్వంలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న వారణాసి మూవీ గురించి మేకర్స్…
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐటమ్ సాంగ్ పెండింగ్‌లో ఉండగా,…
ప్రస్తుతం తాను భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని, అందువల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించడం లేదని, అయితే సినిమా మాత్రం…
రణవీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 చిత్ర మేకర్స్‌కు బంపర్ డీల్ దక్కింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను…
సినిమా నచ్చితే కొత్త నటీనటులను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారని, అదే నచ్చకపోతే పాత నటీనటులను సైతం పట్టించుకోవడం లేదని నటుడు…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో ఇంకా మనం తొలి దశలోనే ఉన్నామని, తరువాతి రోజుల్లో సీజన్ మధ్యకు…