Ante Sundaraniki Review : అంటే సుంద‌రానికి మూవీ రివ్యూ..!

Ante Sundaraniki Review : వైవిధ్య‌భ‌రిత‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుని సినిమాలు తీస్తాడ‌ని నాచుర‌ల్ స్టార్ నానికి పేరుంది. ఆయ‌న తీసే ఒక్కో చిత్రానికి, ఇంకో చిత్రానికి అస‌లు సంబంధం ఉండ‌దు. పూర్తిగా భిన్న‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుని సినిమాలు చేస్తుంటాడు. ఈ క్ర‌మంలోనే అంటే సుంద‌రానికి పేరిట ఓ భిన్న‌మైన క‌థ‌తో మ‌ళ్లీ థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇందులో నానికి జోడిగా న‌జ్రియా న‌టించింది. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది.. నాని మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడా.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

క‌థ‌..

సుంద‌ర్ (నాని), లీల (న‌జ్రియా) ఇద్ద‌రు చిన్న‌ప్ప‌టి నుంచే ప్రాణ స్నేహితులు. వీరికి ఒక‌రంటే ఒక‌రికి ఎంతో ఇష్టం ఉంటుంది. అయితే వీరివి భిన్న‌మైన మ‌తాలు. చిన్న‌ప్ప‌టి నుంచే లీల అంటే సుంద‌ర్ విప‌రీత‌మైన ప్రేమ‌ను పెంచుకుంటాడు. అయితే ఆ విష‌యాన్ని ఆమెకు చెప్పేందుకు భ‌య‌ప‌డుతుంటాడు. చివ‌ర‌కు వారు యుక్త వ‌య‌స్సుకు వ‌చ్చాక ప్రేమ‌లో ప‌డ‌తారు. కానీ ఆ విష‌యాన్ని త‌మ కుటుంబాల‌కు చెప్పేందుకు భ‌య‌ప‌డుతుంటారు. ముఖ్యంగా సుంద‌ర్‌ది బ్రాహ్మ‌ణ కుటుంబం కావ‌డం, అత‌ని తండ్రి (న‌రేష్‌) సంప్ర‌దాయాలు, ఆచారాల‌కే ఎక్కువ విలువ‌నిస్తుండ‌డంతో.. సుంద‌ర్ త‌న ప్రేమ విష‌యాన్ని ఇంట్లో చెప్పేందుకు భ‌య‌ప‌డ‌తాడు. అయితే చివ‌ర‌కు ఏమ‌వుతుంది ? ఇరు కుటుంబాల‌ను వారు ఒప్పించి పెళ్లి చేసుకుంటారా ? వారి ప్రేమ క‌థ సుఖాంతం అవుతుందా ? అన్న విష‌యాల‌ను తెలుసుకోవాలంటే.. సినిమాను వెండితెర‌పై చూడాల్సిందే.

Ante Sundaraniki Review

ఈ మూవీని నాని త‌న భుజ స్కంధాల‌పై న‌డిపించాడ‌ని చెప్ప‌వ‌చ్చు. నాచుర‌ల్ స్టార్ అన్న బిరుదు ఊరికే రాలేదు. సంప్ర‌దాయ బ్రాహ్మ‌ణ యువ‌కుడిగా నాని ఇందులో అద్భుతంగా న‌టించాడు. ఓ వైపు త‌మ ఆచారాలు, వ్య‌వ‌హారాలు, వాటిని పాటిస్తూ ఇబ్బందులు ప‌డే యువ‌కుడిగా నాని ఇందులో క‌నిపించాడు. ఇక న‌జ్రియా కూడా త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకుంది. చాలా చోట్ల ఆమె న‌ట‌న స‌హ‌జ‌సిద్ధంగా అనిపిస్తుంది. నాచుర‌ల్ స్టార్ నాని అయిన‌ప్ప‌టికీ న‌జ్రియా కూడా అలాగే న‌టించింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక ద‌ర్శ‌కుడు వివేక్ ఆత్రేయ ఒక సూక్ష్మ‌మైన పాయింట్‌ను తీసుకుని దాని చుట్టూ క‌థ అల్లి మూవీని తెర‌కెక్కించడంలో స‌క్సెస్ అయ్యాడ‌ని చెప్ప‌వ‌చ్చు. గ‌తంలో ఈయన మెంట‌ల్ మ‌దిలో, బ్రోచేవారెవ‌రురా.. చిత్రాల‌ను తీశారు. అందువ‌ల్ల అంటే సుంద‌రానికి లాంటి చిత్రాన్ని తీయ‌డం ఆయ‌న‌కు పెద్ద‌గా క‌ష్టం అయి ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ సినిమా ఆద్యంతం ఆయ‌న తీసుకున్న జాగ్ర‌త్త‌లు.. సీన్ల‌ను తీసిన విధానం.. స్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ కూడా ఈ మూవీలో క‌నిపిస్తుంది.

ఇక న‌రేష్‌, న‌దియా, రోహిని, అళ‌గం పెరుమాల్‌లు కూడా త‌మ పాత్ర‌ల ప‌రిధుల మేర అద్భుతంగా న‌టించారు. అయితే వీరిలో న‌రేష్‌కు ఎక్కువ సీన్లు వ‌చ్చాయి. అలాగే అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చిన్న రోల్‌లో చేసి అల‌రించింది. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌ను కూడా స‌రిగ్గానే ఉప‌యోగించుకున్నారు. రాహుల్ రామ‌కృష్ణ ఒక సీన్‌లో వ‌చ్చి వెళ్తాడు. మిగిలిన న‌టీనటులు అంద‌రూ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు.

వివేక్ సాగ‌ర్ ఈ సినిమాకు సంగీతం అందించారు. అయితే గుర్తుండిపోయే పాట‌లు ఏవీ లేవు. కానీ సినిమాకు అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. కామెడీ సీన్ల‌కు ఈయ‌న అందించిన మ్యూజిక్ అద్భుతంగా వ‌చ్చింది. క‌నుక ప్రేక్ష‌కులు ఆయా సీన్ల‌ను బాగా ఎంజాయ్ చేయ‌గ‌లుగుతారు. ఇక ఈ మూవీలో నాని న‌ట‌న‌, క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం, న‌టీన‌టుల పెర్ఫార్మెన్స్‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆక‌ట్టుకునే అంశాలు. సినిమా నిడివి ఎక్కువ కావ‌డం, మొద‌టి భాగంలో అక్క‌డక్క‌డా కొన్ని సీన్లు, పాట‌లు మైన‌స్ పాయింట్స్‌. అయితే ఓవ‌రాల్‌గా చూస్తే ఫ్యామిలీ ప్రేక్ష‌కుల‌కు ఈ మూవీ బాగా న‌చ్చుతుంది. దీన్ని ఒక‌సారి క‌చ్చితంగా చూడవ‌చ్చ‌ని చెప్ప‌వ‌చ్చు.

Sambi Reddy

బి.సాంబిరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్: మీడియా రంగంలో 14 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన జర్నలిస్ట్. గతంలో ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతి (ABN), ఎన్టీ న్యూస్ (NT News) వంటి ప్రముఖ సంస్థలలో బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఇండియా డైలీ లైవ్ ఎడిటర్-ఇన్-చీఫ్‌గా రాజకీయ, సామాజిక అంశాలపై విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు.

Recent Posts

క‌మిన్స్ వ‌చ్చినా కిష‌నే కెప్టెన్ కావాలి.. ఎస్ఆర్‌హెచ్‌పై హ‌ర్భ‌జ‌న్ సింగ్ సంచలన వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియా పేస‌ర్ ప్యాట్ క‌మిన్స్ తిరిగి ఐపీఎల్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుతో చేరిన‌ప్ప‌టికీ కెప్టెన్‌గా ఇషాన్ కిష‌న్‌ను కొన‌సాగించాల‌ని భారత…

Thursday, 23 April 2026, 8:33 PM

ఆ ఈగోను హోటల్ గదిలోనే వదిలేస్తా.. రాజస్థాన్ రాయల్స్ విజయం తర్వాత జడేజా షాకింగ్ కామెంట్స్!

క్రికెట్ మ్యాచ్‌ల‌లో తాను ఈగోను ప్ర‌ద‌ర్శించ‌న‌ని, దాన్ని హోట‌ల్ గ‌దిలోనే వ‌దిలి వ‌స్తాన‌ని, జ‌ట్టు త‌న‌ను ఎలా ఉప‌యోగించుకోవాల‌నుకుంటుందో అలా…

Thursday, 23 April 2026, 6:22 PM

మెక్సికో ‘కామిక్ కాన్’లో మహేష్ బాబు ‘వారణాసి’ హవా.. రాజమౌళి మాస్టర్ ప్లాన్!

రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో మ‌హేష్ బాబు, ప్రియాంక చోప్రా హీరో హీరోయిన్లుగా శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న వార‌ణాసి మూవీ గురించి మేక‌ర్స్…

Thursday, 23 April 2026, 3:27 PM

రామ్ చరణ్ ‘పెద్ది’లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు.. ఐటమ్ సాంగ్ షూట్ డేట్ ఫిక్స్!

రామ్ చ‌ర‌ణ్ హీరోగా బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమాకు గాను ఓ ఐట‌మ్ సాంగ్ పెండింగ్‌లో ఉండ‌గా,…

Thursday, 23 April 2026, 11:56 AM

కేజీఎఫ్ 3 పక్కా.. కానీ ఇప్పుడే కాదు! క్లారిటీ ఇచ్చిన రాకింగ్ స్టార్ యష్‌..

ప్ర‌స్తుతం తాను భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాన‌ని, అందువ‌ల్ల కేజీఎఫ్ 3 సినిమాపై ఆలోచించ‌డం లేద‌ని, అయితే సినిమా మాత్రం…

Tuesday, 21 April 2026, 10:12 PM

‘ధురంధర్ 2’ బంపర్ డీల్.. రూ.155 కోట్లకు ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న జియో హాట్ స్టార్!

ర‌ణ‌వీర్‌సింగ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన ధురంధ‌ర్ 2 చిత్ర మేక‌ర్స్‌కు బంప‌ర్ డీల్ ద‌క్కింది. ఈ సినిమా డిజిట‌ల్ హ‌క్కుల‌ను…

Monday, 20 April 2026, 8:30 PM

రూ. 50 కోట్ల క్లబ్‌లో ‘డెకాయిట్’.. ప్రేక్షకుల తీర్పుపై అడివి శేష్ సెన్సేషనల్ కామెంట్స్!

సినిమా న‌చ్చితే కొత్త న‌టీన‌టుల‌ను కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నార‌ని, అదే న‌చ్చ‌క‌పోతే పాత న‌టీన‌టుల‌ను సైతం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని న‌టుడు…

Saturday, 18 April 2026, 6:32 PM

ఫీల్డింగ్‌లో లేడు.. బ్యాటింగ్‌లో అదరగొట్టాడు! కోహ్లీ ‘ఇంపాక్ట్’ ఇన్నింగ్స్ వెనుక అసలు రహస్యం ఇదే..

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 2026 సీజ‌న్‌లో ఇంకా మ‌నం తొలి ద‌శ‌లోనే ఉన్నామ‌ని, త‌రువాతి రోజుల్లో సీజ‌న్ మ‌ధ్య‌కు…

Thursday, 16 April 2026, 5:39 PM