Anjali : అనేక సినిమాల్లో హీరోయిన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి అంజలి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్‌ను ప్రారంభించింది. తరువాత కోలీవుడ్‌కు పరిచయం అయింది. ఆ తరువాత ఫొటో అనే మూవీ ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. అనంతరం షాపింగ్ మాల్, జర్నీ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.. తదితర చిత్రాలతో పాపులర్ అయింది. అయితే ప్రస్తుతం అంజలికి పెద్దగా అవకాశాలు లేవు. అయితే ఈమె బాలకృష్ణ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అఖండ తరువాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మూవీని చేస్తున్న విషయం విదితమే. ఎన్‌బీకే 107 వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులు కొనసాగిస్తున్నారు. అయితే ఈ మూవీ అనంతరం బాలకృష్ణ అనిల్ రావిపూడితో ఓ మూవీని చేయనున్నారు. అందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో అలరించనున్నట్లు తెలుస్తోంది. అందులో బాలకృష్ణకు కూతురిగా శ్రీలీల నటించనుంది.
అనిల్ రావిపూడితో తీయబోయే సినిమాను ఎన్‌బీకే 108 వర్కింగ్ టైటిల్‌తో పూర్తి చేయనున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇందులో బాలయ్యకు భార్యగా ప్రియమణి నటించనున్నట్లు సమాచారం. ఇక ఇదే మూవీలో అంజలి కూడా నటిస్తుందట. కానీ ఈమె అందులో నెగెటివ్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. బాలయ్యను నమ్మించి మోసం చేసి వెన్నుపోటు పొడిచే క్యారెక్టర్‌లో అంజలి నటిస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై త్వరలోనే అధికారికంగా ప్రకటనను విడుదల చేయనున్నట్లు సమాచారం.
త్వరలో ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరఫున ఆడనున్న…
సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్ మూవీ నుంచి ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ…
రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు సృష్టించిన తర్వాత, ఇప్పుడు ప్రేక్షకులను…
భారత క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ టీ20 ప్రపంచకప్ 2026 సందర్భంగా తాను ఉపయోగించిన బ్యాట్‌ను బాలీవుడ్…
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 2003లో విడుదలైన తన భూత్ చిత్రంలో ఊర్మిళా మతోండ్కర్‌ను ప్రధాన పాత్రకు ఎంపిక చేసిన…
భారతీయ బాక్సాఫీస్ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ధురంధర్ 2: ది రివెంజ్ చిత్రం ప్రీమియర్‌ల విషయంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఉగాది…
బంగ్లాదేశ్‌లోని ఢాకాలో శుక్రవారం (మార్చి 13, 2026) జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ ఆటగాడు సల్మాన్ అలీ అఘా,…